సినిమా గాసిప్స్సినిమా వార్తలు

అనుష్క స్థానంలో శ్రీలీలా? అరుంధతి రీమేక్‌పై షాకింగ్ టాక్!

2009లో వచ్చిన ‘అరుంధతి’ తెలుగు సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. అనుష్క చేసిన ఆ పవర్‌ఫుల్ రోల్ ఇంకా ప్రేక్షకుల మైండ్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే—అనుష్క రోల్‌కి శ్రీలీలను ఫిక్స్ చేశారనే రూమర్!

ప్రాజెక్ట్‌ను అల్లుఅరవింద్ తీసుకెళ్తున్నారన్న వార్త. దర్శకుడిగా మోహన్ రాజా అనే పేరు చక్కర్లు కొడుతోంది.

కానీ ఇక్కడే పెద్ద చర్చ మొదలైంది. అనుష్క రేంజ్ రోల్‌లో శ్రీలీల నిలబడగలదా? ఎందుకంటే ‘‘అరుంధతి’’ పాత్రలో మేకప్ కాదు… ఆరా కావాలి. పవర్, గ్రావిటీ, మిస్టిక్—ఆల్ ఇన్ వన్.

హిందీలో ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ పాపులర్. అందుకే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. మరి ఈ టీమ్ కథను కొత్తగా రీ-ఇమాజిన్ చేస్తారా? లేక అదే స్టైల్‌గా తీస్తారా? అన్నది కీలకం.

ఇది శ్రీలీలకు భారీ అవకాశం..బిగ్ రిస్క్ కూడా! . మరి ఈ వార్త నిజమా? అధికారిక ప్రకటవ దాకా వేచి చూడాలి.

Similar Posts