బాలీవుడ్ కింగ్ ఖాన్ వారసుడిగా అందరూ ఆర్యన్ ఖాన్ నుంచి హీరో ఎంట్రీనే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అతను అందరి ఊహలకు షాక్ ఇచ్చేలా కెమెరా ముందు కాకుండా, కెమెరా వెనక డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు!
ఆర్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ “The Ba ..rds of Bollywood” ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొదట్నుంచే బోల్డ్ టాపిక్ అంటూ హైప్ క్రియేట్ చేసిన ఈ సిరీస్‌పై అంతా ఓ కన్నేసి ఉన్నారు. టీజర్ లో రొమాన్స్, యాక్షన్, డ్రామా మిక్స్ అయ్యి “విజువల్ గా రిచ్… స్టైల్ గా స్మార్ట్” అన్న ఫీలింగ్ ఇచ్చేసింది.
కింగ్ ఖాన్ స్వయంగా ఈ సిరీస్ ని ప్రమోట్ చేయడం, కరణ్ జోహార్ “ఆర్యన్ లవ్ యు… ఇది రికార్డులు బ్రేక్ చేస్తుంది!” అని రెచ్చగొట్టడం curiosity మరింత పెంచేశాయి. లీడ్ రోల్‌లో లక్ష్య లిటరల్లీ కిల్ చేస్తున్నాడు అన్న రేంజ్‌లో పర్ఫార్మ్ చేశాడని అంటున్నారు.
అయితే నెట్‌లో మాత్రం “స్టార్ కిడ్‌కి ఫుల్ సపోర్ట్, కానీ కంటెంట్ ఎంత వరకు బోల్డ్?” అనే డిబేట్ మొదలైంది. కేవలం గ్లామర్, బోల్డ్ సీన్స్ మీద బిల్డ్ అయ్యిందా లేక నిజంగా కంటెంట్ తో గెలుస్తుందా? అనే ప్రశ్నలు ఊపేస్తున్నాయి.
సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేసింది – “షారూఖ్ కొడుకు డైరక్షన్ లో సిరీస్.. టీజర్ దుమ్ము రేపేలా ఉంది బాస్ అన్నట్టుంది!”