‘హీరో’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఆ చిత్రం భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఆ కుర్రాడు కొంచెం గ్యాప్ తీసుకుని ‘దేవకీ నందన వాసుదేవ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల రూపొందించిన ఈ చిత్రం కూడా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అయితే ప్రశాంత్ వర్మ అందించిన కథ కావటంతో చాలా మంది ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది.

‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం Disney+Hotstar లో రాత్రి 12 AM నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. అయితే ఇక్కడ నిరాశపరిచే వార్త ఏమిటంటే..కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

తెలుగులో ఎప్పటి నుంచి ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ అవుతుందో తెలియలేదు. తెలుగు వెర్షన్ ఓటిటి ఇంకా అమ్ముడుకాలేదని తెలిసింది.

కథ: కంసరాజు (దేవ్ దత్త నాగె) పరమ దుర్మార్గుడు. తన ఊరిలో తన కళ్లు పడ్డ భూములను సొంతం చేసుకుంటూ.. ఎదురు వచ్చిన వాళ్లందరినీ అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అతడికి తన చెల్లి చెల్లికి పుట్టే మూడో సంతానం ద్వారా ప్రాణ గండం ఉందని కాశీలో ఒక అఘోరా చెప్పిన మాటతో ఆమెను ఒక సంతానానికి పరిమితం చేసి తన భర్తను చంపేస్తాడు. ఐతే అంతలో ఓ హత్య కేసులో చిక్కుకుని అతను జైలు పాలవుతాడు.

తిరిగి వచ్చేసరికి కంసరాజు మేనకోడలు సత్య (మానస వారణాసి) పెరిగి పెద్దవుతుంది. ఆ అమ్మాయిని కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది కానీ.. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ అతణ్ని అయోమయంలోకి నెడుతుంది. అప్పుడే సత్య పుట్టుకకు సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి.. ఇంతకీ కంసరాజు ప్రాణ గండం సంగతి ఏమైంది.. ఈ విషయాలు తెర మీదే తెలుసుకోవాలి.

, , , ,
You may also like
Latest Posts from