
సుందర్ సీ ఔట్! రజినీ ,కమల్ సినిమా కి షాక్ ట్విస్ట్ – ఎవరు కొత్త డైరెక్టర్?
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు, తమిళ సినిమా ప్రేక్షకులు ఊహించని పెద్ద షాక్‌కి గురయ్యారు. ‘తలైవర్ 173’ సినిమాను సుందర్ సీ డైరెక్ట్ చేస్తున్నారని వచ్చిన వార్తలు ఎంత అద్భుతంగా అనిపించాయో… ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అధికారికంగా వెల్లడించడం అంతే పెద్ద నిరాశగా మారింది.
కమల్ హాసన్ ప్రొడక్షన్లో, రజినీకాంత్–సుందర్ సీ కాంబినేషన్ అంటేనే భారీ హైప్. పైగా అరుణాచలం (1997) తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో ఆతృత రెట్టింపైంది.
కానీ… నవంబర్ 13, 2025 తేదీతో సుందర్ సీ రాసిన లేఖ ఆ ఆనందానికి ఫుల్ స్టాప్ పెట్టింది. “అనివార్య కారణాలవల్ల తప్పుకోవాల్సి వచ్చింది” అని తెలిపారు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, రజినీకాంత్–కమల్ హాసన్ లతో గడిపిన ప్రతి క్షణం ప్రత్యేకమని భావోద్వేగంగా చెప్పారు. తన మీద చూపిన నమ్మకానికి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పుడు అసలు ప్రశ్న – ‘తలైవర్ 173’ను ఎవరు డైరెక్ట్ చేస్తారు?
సుందర్ సీ వెళ్లిపోవడంతో ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్‌కి కొత్త కెప్టెన్ ఎవరు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అభిమానుల ఆతృత పెరిగిపోయింది. రజినీకాంత్ 173వ సినిమా కాబట్టి అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి.
సుందర్ సీ ఫ్యాన్స్‌కి హామీ!
నిరాశ పడ్డ అభిమానులను ఉద్దేశించి, త్వరలోనే మరింత అద్బుతమైన సినిమాలతో వస్తానని సుందర్ సీ చెప్పారు.
ఇక ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక్కటే చూస్తోంది—
కమల్ హాసన్ టీమ్ ఎవరిని కొత్త డైరెక్టర్‌గా ప్రకటిస్తారు? ‘థలైవర్ 173’ మళ్లీ వేగం ఎప్పుడు అందుకుంటుంది?
రజినీ అభిమానులు, తమిళ సినిమా వర్గాలు… అందరూ లుకింగ్ అట్ ద బిగ్ అనౌన్స్మెంట్!
