వినాయక చవితి సందర్బంగా ఆగస్టు 27న విడుదలైన నారా రోహిత్ సుందరాకాండ సినిమాపై రిలీజ్‌కి ముందు నుంచే మంచి క్రేజ్ కనిపించింది. పెయిడ్ ప్రీమియర్స్ వేసేటంత కాన్ఫిడెన్స్ టీమ్‌కి ఉండటమే కాకుండా, చూసినవాళ్లందరూ పాజిటివ్ టాక్ చెప్పడంతో ఫ్యాన్స్‌కి, ట్రేడ్‌కి మంచి హోప్ కలిగింది.

సినిమా ఓపెనింగ్స్ తర్వాత కూడా సోషల్ మీడియాలో, రివ్యూల్లో బాగానే స్పందన వచ్చింది. “ఎంటర్‌టైనర్‌గా బాగుంది, రోహిత్ రోల్ కొత్తగా ఉంది” అన్న మాటలు వినిపించాయి. అంతేకాదు, ఈ మధ్యలో మంచి కలెక్షన్లు సాధిస్తున్న మరో సినిమా లేకపోవడంతో, సుందరాకాండ బాక్సాఫీస్ వద్ద బాగా దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు.

కానీ కలెక్షన్లు మాత్రం నిరాశే!

రివ్యూలు, టాక్ బాగున్నా — బాక్సాఫీస్ వద్ద మాత్రం షాకింగ్ రిజల్ట్. థియేటర్ ఖర్చులు కూడా రాబట్టలేని స్థాయిలో కలెక్షన్లు పడిపోవడం ట్రేడ్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రిలీజ్‌కి ముందు ఉన్న బజ్ కూడా జనాన్ని హాళ్లకు తేవడంలో విఫలమైంది.

నారా రోహిత్ గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడం కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయ్యింది. ప్రస్తుతానికి సినిమా వసూళ్లు తక్కువగా ఉండడంతో, వీకెండ్ కలెక్షన్లపై మాత్రమే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది.

ప్రమోషన్స్ తప్పనిసరి

ఈ పరిస్థితుల్లో సుందరాకాండ టీమ్ తక్షణం అగ్రెసివ్ ప్రమోషన్స్ మొదలుపెట్టకపోతే, పాజిటివ్ రివ్యూలు ఉన్నా వసూళ్లు లేని సినిమాగా మిగిలిపోవడం ఖాయం. వీకెండ్‌లో కాస్తైనా మోమెంటం రాకపోతే, ఈ సినిమా ‘రివ్యూలు వేరే – కలెక్షన్లు వేరే’ అన్న క్లాసిక్ ఉదాహరణగా మిగిలిపోతుంది.

ఇక స్టూడెంట్ ని ప్రేమించిన లెక్చరర్ కథతో వచ్చిన సినిమా తాజా ‘సుందరకాండ’ (sundarakanda) .సరైన హిట్ ని చూసి చాలా కాలమైన నారా రోహిత్ డిఫరెంట్ సబ్జెక్ట్ కి ఓటేశాడు. నైఫ్ ఎడ్జ్ లాంటి ఈ కథని ఎంతో కన్వెసింగ్ గా చెబితే తప్ప ఆడియన్స్ కి డైజెస్ట్ అవదని తెలిసినా ధైర్యం చేసారు. నారా రోహిత్ యూత్ ఫుల్ సినిమా చేసి చాలా కాలమైంది. బొద్దుగా ఉన్నా ఇందులో యూత్ ఫుల్ లుక్ లో కనిపించాడు.

, , , , ,
You may also like
Latest Posts from