తెలుగు చిత్రసీమలో “మిల్క్ బ్యూటీ”గా గుర్తింపు పొందిన తమన్నా భాటియా ఇప్పటికీ తన మురిపెమైన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే సినీ రంగంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు దాటిన ఈ అందాల భామ… 35 వయసులోనూ తన యవ్వన కాంతితో వెలుగులు విరజిమ్ముతోంది.

ఇటీవలే తను చేసిన వెయిట్ లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన స్కిన్‌కేర్ రహస్యాలను బయటపెట్టింది.

“యాంటీ ఏజింగ్ క్రీమ్స్ 50 ఏళ్లవారికి కాదు… 20ల్లోనే మొదలవ్వాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని నేను చాలా చిన్న వయసులో నేర్చుకున్నాను. అప్పటి నుంచే ఫాలో అవుతున్నాను,” అంటూ చెప్పారు.

అంతే కాదు… క్రికెటర్లతో తన పేరును లింక్‌ చేస్తున్న గాసిప్‌లపై కూడా క్లారిటీ ఇచ్చారు. “విరాట్ కోహ్లీగానీ, అబ్దుల్ రజాక్ గానీ… వాళ్లలో ఎవ్వరినీ నేను డేట్ చెయ్యలేదు. అలాంటి వార్తల్లో నిజం లేదు,” అని బాసెక్కారు.

ఇక అభిమానుల ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఈ క్లారిటీతో చాలా గాసిప్స్‌కు ముగింపు పడినట్టే! ఆమె యాంటీ ఏజింగ్ మంత్రం మాత్రం ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.

,
You may also like
Latest Posts from