సినిమా వార్తలు

ఫ్లాప్స్ ఉన్నా ఫాలోయింగ్ తగ్గలేదా? శ్రీలీల క్రేజ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!

పెళ్లి సందD, ధమాకా, స్కంద, గుంటూరు కారం… ఒక దశలో ఈ పేర్లు వినిపించగానే శ్రీలీలే గుర్తొచ్చేది. టాలీవుడ్‌లో యమా ఫాస్ట్‌గా పైకి వచ్చిన హీరోయిన్‌గా ఆమె పేరు మార్మోగింది.

కానీ అదే శ్రీలీల, ఈ మధ్యన రాబిన్‌హుడ్, మాస్ జాతర లాంటి సినిమాల తర్వాత తెలుగు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. ఆఫర్లు లేవా? లేక ఆమెనే ఒక అడుగు వెనక్కి వేసిందా? అసలు ట్విస్ట్ ఏంటంటే — తెలుగులో సినిమాలు తగ్గుతున్న సమయంలోనే, శ్రీలీల క్రేజ్ మాత్రం ఇండస్ట్రీలు దాటుతోంది. టాలీవుడ్‌లో స్లో అయిన కెరీర్… బాలీవుడ్‌లో స్పీడ్ పెంచుకుంటున్న ప్రయాణంగా మారుతోంది. అసలు ఆమెకు హిందీలో ఇంత డిమాండ్ ఎందుకు పెరిగింది?

2025లో శ్రీలీలకు పెద్దగా కలిసిరాలేదు. రాబిన్‌హుడ్, మాస్ జాతర వంటి తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో హీరోయిన్ల మార్కెట్ తగ్గుతుంది. కానీ శ్రీలీల విషయంలో మాత్రం సీన్ రివర్స్! తెలుగు ఫలితాలు ఎలా ఉన్నా, బాలీవుడ్‌లో ఆమె పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది.

శ్రీలీల తొలి హిందీ సినిమా Tu Meri Zindagi Hai (కార్తిక్ ఆర్యన్‌తో) ఇంకా రిలీజ్ కాకుండానే, ఆమె చేతిలో కొత్త ఆఫర్లు లైన్లోకి వచ్చేశాయి. ఇప్పటికే బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అంతేకాదు, సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రాహీం అలీ ఖాన్‌తో కలిసి Diler అనే హిందీ సినిమా షూటింగ్‌లో ఉంది.
ఇప్పుడీ లిస్ట్‌కి మరో సినిమా Choomantar కూడా జత అయ్యిందట. అంటే… తొలి హిందీ సినిమా థియేటర్లకు రాకముందే, శ్రీలీల ఖాతాలో మూడు బాలీవుడ్ సినిమాలు!

ఈ డిమాండ్‌కు అసలు కారణం ఏంటి? Pushpa 2లో ఆమె చేసిన డాన్స్ నంబర్! నార్త్ ఇండియాలో ఆ సినిమా హిస్టరీ క్రియేట్ చేయడం, ముఖ్యంగా “Kissik” సాంగ్ సూపర్ హిట్ కావడంతో, బాలీవుడ్ మేకర్స్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయ్యారు.

2026లో శ్రీలీలకు బిజీ షెడ్యూల్ ఖాయం. తమిళ్‌లో Parasakthiతో పాటు మరిన్ని హిందీ ప్రాజెక్ట్స్ లైనప్‌లో ఉన్నాయి. తెలుగులో ఫలితాలు ప్రశ్నార్థకంగా ఉన్నా, బాలీవుడ్ మాత్రం శ్రీలీలపై భారీగా బెట్టింగ్ చేస్తోంది.

ఇదంతా చూస్తూంటే ఒకటే డౌట్ వస్తోంది. శ్రీలీల తెలుగు మార్కెట్ కంటే ముందు బాలీవుడ్ స్టార్‌గా మారిపోతుందా? దానికి సమాధానం త్వరలోనే థియేటర్లలో తేలనుంది!

Similar Posts