పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసిన తమ్ముడు రీ రిలీజ్… అసలు ఊహించని విధంగా పెద్ద షాక్ ఇచ్చింది.
తెలుగు పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తున్న ఈ కాలంలో, ప్రతి వారం ఓ క్లాసిక్ మూవీ థియేటర్లలోకి వస్తూ హౌస్‌ఫుల్ షోలు క్రియేట్ చేస్తోంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమాల రీ రిలీజ్ అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల పండుగే. కానీ ఈసారి తమ్ముడు మాత్రం ఆ హైప్‌ను అందుకోలేకపోయింది.
1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి పవన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి జింగానియా హీరోయిన్‌గా నటించగా, రమణ గోగుల సంగీతం హిట్ రేంజ్‌లో నిలిచింది. ఇప్పటికీ ఆ పాటలు యూత్‌లో క్రేజ్‌గా ఉన్నాయి.
యితే, ఆ క్రేజ్ రీ రిలీజ్‌లో కనపడలేదనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉండటమే కాకుండా, ఫ్యాన్స్ కూడా పెద్దగా స్పందించలేదు. OG మానియా కారణంగానా లేక అభిమానుల్లో ఆసక్తి తగ్గిందా అన్నది పెద్ద డౌట్‌గా మారింది.
మరీ దారుణమేమిటంటే, కొన్ని సెంటర్స్‌లో ఒక్క హౌస్‌ఫుల్ షో కూడా రాకపోవచ్చు అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని స్పష్టమవుతోంది.
గతంలో ఖుషి , జల్సా , గబ్బర్ సింగ్ లాంటి రీ రిలీజ్‌లు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డులు సృష్టించగా, తమ్ముడు మాత్రం అంచనాలను మించకపోవడం పవన్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది