పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. గురువారం (జులై24న) ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇన్నాళ్లు మూవీ రిలీజ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫ్యాన్స్.. గత మూడ్రోజులుగా టికెట్ల ఓపెనింగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇపుడీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది.
లేటెస్ట్గా ఇవాళ మంగళవారం (జులై22న) హరిహర వీరమల్లు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. జులై 24న ఉదయం 8 గంటలకు మొదటి షో పడనుంది. ఇప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయిటకు వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు క్రిష్ మొదట దర్శకత్వం వహించారని, తర్వాత ఆయన తప్పుకున్న తర్వాత జ్యోతికృష్ణ బాధ్యతలు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు.
కానీ అసలు ట్విస్ట్ ఇంకొక్కడి పేరు బయటకు రావడం! తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం… ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతల్లో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి. అదే కాకుండా, ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్‌ను పవన్ స్వయంగా డైరెక్ట్ చేశారని తెలిసింది.
ఇంతకాలం ఇది రహస్యంగానే ఉండిపోయింది. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తన మాటల్లోనే ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది.
“క్లైమాక్స్‌లో ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంది. దానికి నేను నేనే డైరెక్షన్ చేశా. అప్పట్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ సాధన చేశాను,” అని చెప్పిన పవన్… ఈ సినిమాలో కేవలం హీరోగా మాత్రమే కాకుండా, డైరెక్టర్‌గా కూడా క్రెడిట్ పొందినట్లైంది!
ఇదంతా చూస్తే…
‘హరిహర వీరమల్లు’ = క్రిష్ + జ్యోతికృష్ణ + పవన్ కళ్యాణ్
అంటే మూడో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అన్నమాట!
ఈ కొత్త సమాచారం సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. పవన్ మార్క్ యాక్షన్, డైరెక్షన్ రెండూ ఈ సినిమాలో ఎలా వర్కౌట్ అయ్యాయో తెలియాలంటే, సినిమా రిలీజ్‌దాకా వెయిట్ చేయాల్సిందే!