బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay devgan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రాజ్ కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2018లో విడుదలై విజయాన్ని అందుకున్న ‘రైడ్’కు (Raid) సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు (Raid 2 Trailer).
‘ఓ వైపు అధికారం.. మరోవైపు నిజం.. ఈ ప్రయాణం ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది’ అంటూ అజయ్ దేవ్‌గణ్ దీన్ని షేర్ చేశారు.
ఆదాయపు పన్ను విభాగంలో(Income Tax Department) సీనియర్ అధికారిగా పనిచేసే అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేస్తూ వారిని నిద్రలేకుండా చేస్తుంటాడు
. అయితే, ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై ఐటీ దాడి చేయాలని అమయ్ పట్నాయక్‌కి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుతాయి. ఈ సందర్భంలో దాడి కోసం ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏం సంభవించిందనేది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది.