అనుష్క కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఒకప్పుడు టాలీవుడ్‌ను తన చేతి వేళ్ల మీద నడిపించిన హీరోయిన్. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్‌డమ్‌ను సాధించిన తార. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘బాహుబలి’ వంటి సూపర్ హిట్స్. అలాంటి అనుష్క… ఈ మధ్య తెరపై కనపడకపోవడం అభిమానుల్లో చాలా బాధను నింపుతోంది.

అందరి ప్రశ్న మాత్రం ఒక్కటే: ఎక్కడ ఈ స్వీటీ?ఏమైపోయింది, ఎందుకు కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు?
బాహుబలి విజయ తరవాత చేసిన సైజ్ జోరీ సినిమా తర్వాత అనుష్క కొన్ని శారీరక సమస్యల్ని ఎదుర్కొంది. ఫిట్‌నెస్‌లో వచ్చిన మార్పులు, హార్మోనల్ ఇష్యూస్ ఆమెను మానసికంగా, శారీరకంగా కొంత దెబ్బతీశాయి. బరువు పెరిగింది.

ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో, కొత్త సినిమాలకు తనను తాను మళ్లీ సిద్ధం చేసుకోవడంలో అనుష్కకు ఆత్మవిశ్వాసం కొంత తగ్గిపోయింది.

బరువు తగ్గాలని అనుష్క చేసిన కొన్ని ప్రయత్నాలు బెడసి కొట్టేశాయి. దాంతో ఆమె మీడియా ముందుకు కూడా రాలేకపోతోంది. అనుష్కని ఓ సినిమా ఫంక్షన్లో చూసి ఎంతో కాలమైంది.

ఓ సినిమా ఒప్పుకొంటే, ఆ సినిమా ప్రచారంలో తప్పకుండా కనిపించాలి. అందుకే.. ఈ ఇబ్బందులు తట్టుకోలేక అనుష్క సినిమాలు తగ్గించేసింది.
అనుష్క దగ్గరకు మంచి కథలు వచ్చాయి. కానీ అనుష్క మాత్రం తన పరిపూర్ణ రూపంతో, తన స్థాయికి తగిన బలం, అందం, నమ్మకంతో తిరిగి రావాలనుకుంది.

తనను తాను కొత్తగా చూడాలని కోరుకుంది. అందుకే షూటింగులకు కొంత దూరంగా నిలిచింది. ప్రచార కార్యక్రమాలకు కూడా రావడం తగ్గించింది.
అనుష్క ఇప్పటికీ సినిమాలపై ప్రేమను కోల్పోలేదు. కానీ, తను నటించబోయే ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయి డెడికేషన్ ఇవ్వాలనుకుంటోంది. తాను మళ్లీ తెరపై మెరిసే ముందు — పూర్తి ఆరోగ్యంతో, పూర్తి ఫిట్‌నెస్‌తో వెనక్కి రాలాలని నిర్ణయించుకుందని సన్నిహితులు చెప్తున్నారు.

అనుష్క కొత్త సినిమాలు ఒప్పుకోవడం గురించి ఎన్ని గాసిప్స్ వచ్చినా, నిజం ఒకటే — ఆమె తాను సిద్ధమైనప్పుడు మాత్రమే తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. వరస సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నదనేది గాలి వార్తే. స్వీటీ ఓ మంచి కం బ్యాక్ ప్లాన్‌తో మెల్లిగా మళ్లీ మెరవబోతోంది.

అనుష్క మళ్లీ తెరపైకి రావాలని ఉందట. కానీ, ఇప్పుడు కాదు. పూర్తిగా సిద్దమైన తర్వాత మాత్రమే. ఎందుకంటే, ప్రేక్షకులు తాను సృష్టించిన మాయాజాలాన్ని మళ్లీ మరిచిపోలేకపోతున్నారు. అనుష్క తనను తాను అలాగే చూసుకోవాలని కోరుకుంటోంది.

ఈ మౌనంలో గొప్ప సంకల్పం ఉంది. ఈ వెనకడుగు, ముందడుగు వేయడానికి తీసుకున్న ధైర్యం. అనుష్క వెనుకబడినదేం కాదు… ఆమె మళ్లీ రాబోతోంది. స్వీటీ తిరిగొస్తుంది… ఒక రోజున నిశ్శబ్దాన్ని ఛిద్రించి… మళ్లీ మాయచేస్తుంది.