పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు.

జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలకు తగినట్టే.. ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి.

మొత్తం నాలుగు రోజుల్లో థియేటర్లకు రానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ చిత్రం హరి హర వీరమల్లు.. కానీ రిలీజ్ ముందే బిజినెస్ పరంగా కొన్ని అడ్డంకులు ఎదురైతే ఈ సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగారు త్రివిక్రమ్ శ్రీనివాస్!

ఇది అధికారికంగా త్రివిక్రమ్‌కి సంబంధం లేని సినిమా అయినప్పటికీ, ఆయన పోస్టు ప్రొడక్షన్ పనుల్లోనూ, ఫైనాన్షియల్ వ్యవహారాల్లోనూ సైలెంట్ గా కీలక పాత్ర పోషించారు. పవన్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్.. నిర్మాత ఏఎం రత్నం పక్షాన నిలబడి, సినిమా విడుదలలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసారు.

ఇప్పటికే టాప్ డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరిపిన త్రివిక్రమ్, థియేట్రికల్ బిజినెస్ సమస్యలన్నీ కసరత్తు చేసి మరీ పరిష్కరించారు అని సమాచారం.

ఇంతటి వెయిట్ చేసిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్.. చివరికి త్రివిక్రమ్ పర్సనల్ ఇంటరెస్ట్ వల్ల సాఫీగా రిలీజ్ అవుతోంది!

, , , , , ,
You may also like
Latest Posts from