మహాశివరాత్రి సందర్భంగా థియేటర్‌లలో వరస సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీలోనూ అనేకమైన ఇంట్రస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1
మజాకా
దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మజాకా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా చేసింది. రావు రమేష్, మన్మథుడు హీరోయిన్ అన్హు కీలక పాత్రలు పోషించారు. రాజేష్ దండా, ఉమేశ్ కె.ఆర్.బన్సాల్ నిర్మించారు. ఇది సందీప్ కిషన్‌కి 30వ చిత్రం.
మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. తండ్రిగా రావు రమేష్. కొడుకుగా సందీప్ కిషన్.. ఆ ఇద్దరి ప్రేమ కథలతో సాగే సరదా చిత్రమని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. పూర్తిగా ఎంటర్నమెంట్ తో నిండిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ముస్తాబైంది.
2
శబ్దం
వైశాలి చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం శబ్దం. 7జీ ఫిల్మ్స్ శివ నిర్మించారు. లక్ష్మీ మేనన్, లైలా, సిమ్రన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుమల ముందుకు రానుంది. మంచి కథ, భావోద్వేగాలతో నిండిన హరర్ మూవీ అని చిత్ర బృందం చెబుతోంది. శబ్దం ఒక ఆయుధమని.. ఒక రమైకమైన కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించినట్టు తెలుస్తోంది.
3
అగాథియా
రంగం ఫేమ్ జీవా నటించిన లేటెస్ట్ మూవీ అగాథియా. ఏంజిల్స్ వర్సెస్ డెవిల్. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. పా.విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఓ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది. ఇక తమిళం, తెలుగుతో పాటు పాన్ ఇండియా రిలీజ్‌కి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
4
తదిమి తందాన
నూతన నటీనటులు ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం తకిట తదిమి తందాన. కొప్పుల చందన్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథ, కథనాలను తీర్చిద్దినట్టు మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్: డబ్బా కార్టెల్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 28
అమెజాన్ ప్రైమ్:
సుడల్ 2 (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 28
జిద్దీ గర్ల్స్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 27
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ సినిమా) ఫిబ్రవరి 28
జియో హాట్ స్టార్:
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (మలయాళం) ఫిబ్రవరి 28
బీటిల్ జ్యూస్ (హాలీవుడ్ మూవీ) ఫిబ్రవరి 28
ది వాస్ప్ (హాలీవుడ్ మూవీ) ఫిబ్రవరి 28
సూట్స్: లాస్ ఏంజిల్స్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 24
ఎంఎక్స్ ప్లేయర్:
ఆశ్రమ్ 3 (హిందీ సిరీస్) ఫిబ్రవరి 27