హైదరాబాద్ ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదం నాంపల్లి కోర్టు కి చేరింది. హోటల్‌ను అక్రమంగా కూల్చేశారు అంటూ ఫిర్యాదు చేసిన నంద కుమార్… వెంకటేష్, దగ్గుపాటి రానా, సురేష్ బాబును ప్రతివాదులుగా చేర్చాడు. దగ్గుబాటి కుటుంబం తరఫున అడ్వకేట్ కోర్టుకు హాజరయ్యారు.

బుధవారం కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత, వెంకటేష్, రానా, సురేష్ బాబు తదితరులు అందరినీ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 16కి వాయిదా వేసింది.

కేసు వెనుక విషయం:

2022 నవంబరులో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి డెక్కన్ హోటల్‌ను ధ్వంసం చేశారు. అప్పుడు నంద కుమార్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణ మధ్య హోటల్ పై ఏ చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ, 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం కోర్ట్ ఆర్డర్స్ లెక్కించకుండానే హోటల్‌ను పూర్తిగా కూల్చివేశిందని నంద కుమార్ మరోసారి ఫిర్యాదు చేశారు.

ఫిల్మినగర్ కోర్టు పోలీసులకు ఆదేశిస్తూ, హైకోర్టు ఆర్డర్స్‌ ను లెక్కచేయని వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని మరియు కేసును మరింత క్షుణ్ణంగా విచారించమని చెప్పింది.

, , , , , ,
You may also like
Latest Posts from