
విజయ్ ని ఇలా తగులుకున్నాడేంటి వేణుస్వామి? జోస్యం నిజమైందంటూ వీడియో, వైరల్!
సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్, కాబోయే సీఎం రేసులో ఉన్న దళపతి విజయ్ కోటలో ఇప్పుడు ముసలం పుట్టింది. 27 ఏళ్ల వైవాహిక బంధానికి సంగీత గుడ్ బై చెప్పేసి, కోర్టు మెట్లు ఎక్కడం కోలీవుడ్‌లో పెను తుఫాను సృష్టించింది. అయితే, ఈ గ్యాప్‌లోకి ఎప్పటిలాగే కాంట్రవర్షియల్ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎంట్రీ ఇచ్చి రచ్చ మొదలుపెట్టారు. “నేను ఆ రోజే చెప్పాను కదా.. ఇదిగో వీడియో సాక్ష్యం” అంటూ ఆయన వదిలిన క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలు విజయ్ జాతకం గురించి వేణుస్వామి ఏం చెప్పారు? ఆ వీడియోలో ఉన్న షాకింగ్ నిజాలేంటి?
విజయ్ ఇలా తగులుకున్నాడేంటి? వేణుస్వామి పాత వీడియో రచ్చ!
విజయ్ విడాకుల వార్త బయటకు రాగానే వేణుస్వామి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. 2025 అక్టోబర్‌లో తాను ఇచ్చిన ఒక ప్రిడిక్షన్ వీడియోను ఇప్పుడు షేర్ చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషన్ జరగబోతోంది. ఒక సూపర్ స్టార్ హీరో తన భార్యకు విడాకులిచ్చి, ఒక స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు” అని జోస్యం చెప్పారు. అప్పుడు ఆయన ఎవరి పేరు చెప్పకపోయినా, ఇప్పుడు విజయ్ విడాకుల మ్యాటర్ బయటకు రావడంతో “నేను చెప్పిందే కదా జరిగింది!” అన్నట్టుగా వీడియోలు వదులుతున్నారు.
12 పేజీల పిటిషన్.. ఆరోపణలు వింటే ఫ్యూజులు అవుట్!
సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన 12 పేజీల పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్. విజయ్‌కు ఒక స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందన్న కారణంతోనే ఆమె విడాకులు కోరినట్లు సమాచారం. అంతేకాకుండా, తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, మానసిక క్రూరత్వానికి గురిచేశారని ఆమె ఆరోపించడం విజయ్ అభిమానులను కలవరపెడుతోంది. మార్చి 20న ఈ కేసు విచారణకు రాబోతోంది. విచారణ మొత్తం రహస్యంగా (In-camera) జరగాలని సంగీత కోరడం చూస్తుంటే, ఇందులో బయటకు రాని నిజాలు ఇంకెన్ని ఉన్నాయో అని చర్చ మొదలైంది.
రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ పడుతుందా?
విజయ్ తన పార్టీ ‘టీవీకే’ (TVK) ద్వారా తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో విడాకులు, అక్రమ సంబంధం వంటి ఆరోపణలు రావడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. వేణుస్వామి చెప్పినట్టుగా ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? విజయ్ నిజంగానే ఆమెను పెళ్లి చేసుకుంటారా? లేక ఇదంతా కేవలం యాదృచ్ఛికమా? అనే ప్రశ్నలు ఇప్పుడు జనాల మెదడును తొలిచేస్తున్నాయి.
సమంత-చైతన్య విడాకుల విషయంలో వేణుస్వామి చెప్పిన మాటలు నిజమైనప్పటి నుండి ఆయన జోస్యాలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా ఆయన వీడియోలు పెడుతుండటంతో జనాలు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ ఈ వివాదం నుండి ఎలా బయటపడతారో చూడాలి. మరి వేణుస్వామి జ్యోతిష్యంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పింది నిజమే అవుతుందా? కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి!
