సినిమా వార్తలు

“నా వల్ల నిర్మాత రోడ్డున పడ్డాడు”.. దళపతి విజయ్ ఆవేదన!

దళపతి విజయ్ (Vijay) చివరి సినిమా ‘జననాయకన్’ (Jana Nayagan) విడుదలకు నోచుకోక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. జనవరి 9నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయింది. అసలు ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది? దీనిపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న విజయ్ తాజాగా నోరు విప్పారు. తన సినిమా ఆగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.

రాజకీయలే సినిమాను బలి తీసుకున్నాయా? తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ ని “మీ సినిమా ఆగిపోవడానికి రాజకీయలే కారణమా?” అని అడగగా.. విజయ్ షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. “నా రాజకీయ ఎంట్రీ వల్లే ఈ సినిమా ఇబ్బందుల్లో పడింది. నా వల్ల పాపం ఆ ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, ఆయన పరిస్థితి తలచుకుంటే చాలా బాధేస్తుంది” అంటూ విజయ్ ఎమోషనల్ అయ్యారు.

ముందే ఊహించా!

నేను ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ పెట్టినప్పుడే నాకు తెలుసు.. నా సినిమాలకు అడ్డంకులు సృష్టిస్తారని! నేను దీనికి మెంటల్ గా ఎప్పుడో ప్రిపేర్ అయ్యాను. కానీ నా వల్ల నిర్మాత ఇబ్బంది పడకూడదు అన్నదే నా బాధ” అని విజయ్ కుండబద్దలు కొట్టారు. రాజకీయ కక్ష సాధింపు వల్లే ఈ సినిమా డిలే అయ్యిందని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు.

రిలీజ్ ఎప్పుడు?

మరోవైపు చిత్ర నిర్మాతలు సెన్సార్ బోర్డుతో చర్చలు జరుపుతున్నారు. అన్నీ కుదిరితే ఫిబ్రవరి నెల ఆఖరులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ పొలిటికల్ హీట్ సినిమా రిలీజ్ కి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది చూడాలి!

విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి!

Similar Posts