విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన “కింగ్‌డమ్” అనే సినిమా ప్రస్తుతం షూట్ పూర్తై రిలీజ్ కు రెడీగా ఉంది. దర్శకుడికి “జెర్సీ” వంటి క్లాసిక్ హిట్ ఉండటంతో, సినిమా పట్ల కొంత ఆసక్తి ఉన్నా… ఇది బ్లాక్‌బస్టర్ స్థాయిలో హైప్ క్రియేట్ చేయలేకపోయింది. విజయ్ దేవరకొండకి గత కొన్ని సినిమాలుగా సరైన హిట్లు లేవు. బాక్సాఫీస్ వద్ద 25 కోట్లు కూడా వసూలు చేయలేని ఫలితాలతో వరుసగా అంచనాలు తలకిందులవుతున్నాయి.
అయినా సరే — ఈ సినిమాకి నిర్మాతలు పెట్టిన బడ్జెట్ 130 కోట్లు అన్నది ఇండస్ట్రీలో షాక్ కలిగిస్తోంది.
ఇటీవలి ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు.
“కథలో డిమాండ్ ఉంది. దర్శకుడి విజన్ స్పష్టంగా ఉంది. అందుకే మేము రాజీపడలేదు. మా సినిమాకి 130 కోట్ల వరకు ఖర్చయింది,” అని ఆయన స్పష్టం చేశారు.
అయితే ప్రశ్నలెన్నో!
విజయ్ దేవరకొండ ప్రస్తుత బాక్సాఫీస్ మార్కెట్ ఏమాత్రం బలంగా లేదని ట్రేడ్ చెబుతోంది. అలాంటప్పుడు ఈ స్థాయి బడ్జెట్ ఎందుకు? దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నా, హీరో సెలెక్షన్‌లపై నమ్మకం కోల్పోయిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతోందన్నది డౌట్‌గా మారుతోంది.
130 కోట్ల బడ్జెట్‌ను న్యాయంగా నిలబెట్టుకోవాలంటే… ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం తప్పనిసరి. మంచి కంటెంట్, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్, మార్కెటింగ్ స్ట్రాటజీలు తప్పనిసరి. లేదంటే ఇది ఘోరమైన రిస్క్‌గా మిగిలిపోవచ్చు.
ఏదైమైనా
విజయ్ దేవరకొండ మార్కెట్‌ను మరిచి బడ్జెట్ పెడితే… కథ అంతేనా? లేక ఇది నిజంగానే ‘కింగ్‌డమ్’ కింగ్‌సైజ్ సక్సెస్ అవుతుందా?