విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కింగ్ డమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ కు ముందు పెద్దగా సౌండ్ చేయలేదు. టీజర్ ఇటీవలే విడుదలై మంచి హైప్ బజ్‌ని సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ లేదు. దాంతో ఈ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే కింగ్ డమ్ సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని మరియు సినిమా లాభాలను పంచుకోవడానికి అంగీకరించినట్లు చిత్ర నిర్మాత నాగ వంశీ ఇప్పుడు వెల్లడించారు. కింగ్ డమ్ భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది మరియు నటుడు ప్రొడక్షన్ హౌస్ నుండి భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సినిమా కథకు 1980లలో జరిగిన శ్రీలంక సివిల్ వార్‌ కనెక్షన్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఓ రెబల్ పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రజల పక్షాన పోరాడే పాత్రలో అతడు మిలిటరీ శక్తులకు ఎదురు నిలిచే స్టైల్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిజైన్, మిలిటరీ బేస్డ్ లొకేషన్లు చూస్తే ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతోంది.

త ఏడాది ఫ్యామిలీ స్టార్ రూపంలో విజయ్ దేవరకొండ పెద్ద కుదుపుకు గురయ్యాడు. అతని ఆశలన్నీ ఇప్పుడు కింగడమ్ మీద ఉన్నాయి. ఈ చిత్రం అతనికి కీలకమైనది. తప్పనిసరిగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది.

,
You may also like
Latest Posts from