
విజయ్ దేవరకొండ కెరీర్‌లో కొత్త చాప్టర్ మొదలవబోతోంది. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్నాతో పీరియడ్ డ్రామా షూట్‌లో బిజీగా ఉన్న విజయ్, మరో భారీ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయబోతున్నాడు.
ఈ కొత్త సినిమా రవి కిరణ్ కోల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది — “రాజా వారు రాణి గారు” తో గుర్తింపు తెచ్చుకున్న రవి, ఈసారి కోస్తా ఆంధ్ర నేపథ్యంలో సాగే రూరల్ యాక్షన్ డ్రామా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆఫీసులో పూజా కార్యక్రమం జరగనుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన హాట్ అప్‌డేట్ — హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఫైనల్ అయ్యింది!
మేకర్స్ అధికారికంగా ఆమె పేరును ప్రకటించారు. వివాహం తర్వాత ఇది కీర్తి సురేశ్‌కి మొదటి తెలుగు సినిమా.
గత ఏడాది డిసెంబరులో ఆమె తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సరైన ఆఫర్ కోసం వెయిట్ చేసిన కీర్తి, ఈ ప్రాజెక్ట్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే — విజయ్ దేవరకొండ, కీర్తి సురేశ్ ఇద్దరూ మహానటిలో పనిచేసినా, అప్పట్లో వాళ్లకు కలిసిన సీన్ లేదు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ లవ్ ఇంటరెస్ట్‌లుగా కనిపించబోతున్నారు.
మహానటి నుంచి లవ్ స్టోరీ వరకూ — విజయ్ & కీర్తి కొత్త కెమిస్ట్రీపై ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్!
