తమిళ సూపర్ స్టార్ విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan). ఎప్పుడెప్పుడా? అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన విడుదల తేదీని చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 9న (Jana Nayagan Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఊపందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం ఓటిటి డీల్ భారీ రేటుకు ఫైనల్ చేసినట్లు తమిళ మీడియా చెప్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..జననాయకన్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 121 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది తమిళ ఇండస్ట్రీలో భారీ రికార్డ్.

రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్‌ ఆఖరి చిత్రం ఇదేనంటూ కోలీవుడ్‌లో కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి, మళ్లీ సినిమాల్లో నటిస్తారా, లేదా? అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. దాంతో ఈ చిత్రానికి ఈ రేటు పలికిందని చెప్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జన నాయగన్‌’లో మమితా బైజు, బాబీ దేవోల్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విజయ్‌ చివరి సినిమా కానున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికే ప్రణాళికలో భాగంగా స్పెషల్ సాంగ్ ని రూపొందించినట్టు సమాచారం. అందులో దర్శకులు లోకేశ్‌ కనగరాజ్‌, అట్లీ, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌లతోపాటు ఓ హీరో అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారని తెలిసింది.

ఇది విజయ్‌ 69వ సినిమా. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్‌.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

,
You may also like
Latest Posts from