అవును ఇవన్నీ రెస్టారెంట్ లో ఉన్న మెనూలో ఉన్న ఐటమ్సే. హీరో, ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ అలియాస్ అరుణ్‌ అభిమన్యు హోటల్ ఇటీవల ప్రారంభం అయ్యింది. అందులో ఇలాంటి వెరైటీ పేర్లతో ఫుడ్ ని రెడీ చేసి అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే…’అమృతం అడ్డా’ పేరుతో వీజే సన్నీ హోటల్ స్టార్ చేశారు. హైదరాబాద్ సిటీలో సినీ పరిశ్రమ అడ్డా అయినటువంటి కృష్ణా నగర్‌లోని మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1549 దగ్గర ఆయన ఈ హోటల్ ప్రారంభించారు.

‘బిగ్ బాస్’ సెలబ్రెటీలు ప్రియాంకా జైన్, ‘రోల్‌’ రైడా, మానస్‌ నాగులపల్లి, ఆర్జే కాజల్, లోబో, సోహెల్, మెహబూబ్, రాజ్, శ్రీని ఇన్ఫ్రా ఎండీ శ్రీనివాస్, జర్నలిస్టు మూర్తి తదితరులు హాజరు అయ్యారు.

ఇక్కడ మెగాస్టార్‌ ఇడ్లీ, బాలయ్య బజ్జీ, విక్టరీ వడ, డార్లింగ్‌ దోస, పవర్‌ స్టార్‌ పూరి… అంటూ ఐటమ్స్ పేర్లు పెట్టారు. చిన్న పిల్లల కోసం జామ్ దోస, టామ్‌ అండ్‌ జెర్రీ దోస, బనానా దోస, సిరప్‌ ఇడ్లీ, చాక్లెట్‌ దోస అంటూ విచిత్రమైన పేర్లతో వెనూ కూడా సిద్ధం చేశారు.

,
You may also like
Latest Posts from