తెలుగు స్టార్ హీరో రామ్ పోతినేని గ్లామర్ లైఫ్ చూసి చాలా మంది ఆయన ఎప్పుడూ ఈ లైఫ్‌లోనే ఉన్నాడని అనుకుంటారు. కానీ నిజం అంతకంటే విభిన్నం. ఒకప్పుడు విజయవాడలో అతని కుటుంబం అత్యంత సంపన్నంగా ఉండేది. కానీ ఒక్క సంఘటనతో ఆ వైభవం మొత్తం కూలిపోయిందని రామ్ స్వయంగా వెల్లడించాడు. జ‌గ‌ప‌తిబాబు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా టాక్ షోకు ఇటీవ‌ల రామ్ పోతినేని గెస్ట్‌గా వ‌చ్చాడు. ఈ టాక్ షోలో త‌న కెరీర్‌తో పాటు వ్య‌క్తిగ‌త జీవితంపై రామ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

“మేము విజయవాడలో అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకరం. మా బంధువులు డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బిజినెస్ మాగ్నేట్లు. 80వ దశకంలో నా తల్లిదండ్రులు విజయవాడలో అత్యంత ధనవంతులలో ఉన్నారు. కానీ కుల విభేదాలు, వాటి వల్ల జరిగిన హింస కారణంగా మా కుటుంబం అన్నీ కోల్పోయింది. దాంతో నాన్న మమ్మల్ని చెన్నైకి తీసుకెళ్లాడు.”

ఆ మార్పు మాత్రం షాక్ ఇచ్చిందని రామ్ గుర్తుచేసుకున్నాడు —
“విజయవాడలో మా ఇల్లు అంత పెద్దది… నా టాయ్స్‌కి మాత్రమే ఓ ప్రత్యేక రూమ్ ఉండేది. కానీ చెన్నైలో మేము ఉండిన ఇల్లు ఆ టాయ్ రూమ్‌ కన్నా చిన్నది. అలా సాదాసీదా ఇంట్లోనే నేను పెరిగాను,” అని అన్నారు.

అయితే ఆ కష్టకాలం రామ్‌ను నిలబెట్టిందట. 2006లో ‘దేవదాస్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్‌తో స్టార్‌డమ్‌ను సంపాదించాడు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బ్యాంకబుల్ హీరోలలో ఒకరిగా నిలిచిన రామ్ కుటుంబం తిరిగి తమ పాత స్థాయిని సంపాదించుకుంది.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది — టైటిల్‌లానే రామ్ లైఫ్ కూడా ఒక రాజుగా తిరిగి పుట్టిన కథగా నిలుస్తోంది.

, , , , ,
You may also like
Latest Posts from