ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో… డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పూర్తి ఆధిపత్యం చూపిస్తున్న సంగతి తెలసిందే. వీటి డిమాండ్స్, నిబంధనలు రోజురోజుకీ కఠినమవుతున్నాయి. బ్యాక్ ఎండ్ డీల్స్, లాంగ్-టర్మ్ లైసెన్సింగ్ వంటి విషయాల్లో డిజిటల్ దిగ్గజాలు తమ షరతులు నిర్మాతలపై మోపుతున్నాయి.
అయితే… ఈ సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ముందుకు వచ్చిన వ్యక్తి బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్!
తారే జమీన్ పర్ – రెండో అధ్యాయం: థియేటర్‌లోనే ప్రయోగం
అమీర్ ఖాన్ తన తాజా చిత్రం సితారే జమీన్ పర్ కు డిజిటల్ హక్కులు ఏవరికీ అమ్మలేదు.
ఇంతవరకూ బాలీవుడ్ లో ఒక పెద్ద స్టార్ నుంచి వచ్చిన అద్భుతమైన డెసిషన్ ఇది.
YouTube Pay-Per-View మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా ఆయన ఒక కొత్త దారిని తెరవాలనుకున్నాడు.
ఈ చిత్రం మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.
పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో సెకండ్ వీకెండ్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
థియేటర్ కంటే ఓటీటీలోనే ఎక్కువ వసూళ్లు సాధించే ట్రెండ్ ఉన్నప్పటికీ…
అమీర్ ఖాన్ ప్లాన్ వర్కవుట్ అయింది అని చెప్పొచ్చు.
తారే జమీన్ పర్ తో అమీర్ ఖాన్ ఏమి సాధించాడు?
నిర్మాతలకు, డిజిటల్ దిగ్గజాల డిక్టేషన్‌కు ప్రత్యామ్నాయం చూపించాడు
చిన్న షోలతో, తక్కువ స్క్రీన్లలో విడుదల చేసి సినిమాకు లాంగ్ రన్ ఛాన్స్ ఇచ్చాడు
డిజిటల్ హక్కులు ఆలస్యం చేయడం ద్వారా మార్కెట్ విలువను పెంచాడు
ప్రయోగాన్ని విజయంగా మార్చిన స్టేట్‌మెంట్ ఇచ్చాడు