సినిమా వార్తలు

100 కోట్ల టార్గెట్ అన్న ‘కాంతా’.. 40 కోట్లు దాటలేక ఎందుకు ఆగిపోయింది?

రెండు వారాల క్రితం భారీ అంచనాలతో రిలీజైన ‘కాంతా’… ఓపెనింగ్ వేళ రివ్యూలతో అదరకొట్టిన ఈ సినిమా, ఆ తర్వాత ఏమైందో తెలియకుండా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా కుప్పకూలింది! ప్రీమియర్స్‌ నుంచి వచ్చిన హైపే చివరికి సినిమాకే బరువై పడ్డట్టు అనిపించే పరిస్థితి వచ్చింది.

దుల్కర్ సల్మాన్ – భాగ్యశ్రీ బోర్స్ జంటగా వచ్చిన ‘కాంతా’ రెండు వారాల క్రితం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యా పాత్రలో సముద్రకని, కీలకమైన రోలులో రానా దగ్గుబాటి… స్టార్ పవర్ పరంగా సినిమా స్ట్రాంగ్ పాజిషన్‌లోనే ఉంది. చెన్నై ప్రీమియర్ షోల దగ్గర నుంచి “సులభంగా 100 కోట్ల మార్క్ దాటుతుంది” అనేది ట్రేడ్‌లో వచ్చిన మాట. రివ్యూలూ అదే దారిలో వచ్చాయి. కానీ…

FDFS తర్వాతే గేమ్ రివర్స్!

ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత

మిక్స్‌డ్ టాక్

అన్ని సెగ్మెంట్స్‌కి కాక, కొంతమందికే నచ్చిన కంటెంట్

పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ పూర్తి స్థాయిలో రాకపోవడం

ఇవన్నీ కలిసి సినిమాను వరుసగా డౌన్‌ఫాల్ వైపు నెట్టేశాయి.

10 రోజుల్లో కేవలం 35 కోట్లు మాత్రమే!

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం,

10 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్: ~35 Cr

ఫైనల్ రన్: ~40 Cr వద్దే పూర్తయ్యే అవకాశం. ఓపెనింగ్ వికెండ్ తర్వాత వీక్‌డేస్‌లో భారీ క్రాష్, తర్వాతి వీకెండ్స్‌లో ఎలాంటి జంప్ లేకపోవడం
‘కాంతా’ కుదేలయ్యేందుకు ముఖ్య కారణాలుగా నిలిచాయి.

నిర్మాతలకే పెద్ద షాక్!

కంటెంట్‌పై బలంగా నమ్మిన దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి స్వయంగా సినిమాను నిర్మించారు. వారికి ఈ రిజల్ట్ తప్పకుండా నిరాశే మిగులుస్తుంది.

విడుదలకు ముందే 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తుందని హామీ ఇచ్చిన ‘కాంతా’, రిలీజ్ తర్వాత మాత్రం చాలా అరుదుగా కనిపించే బాక్సాఫీస్ కుప్పకూలుడి కేస్ స్టడీగా మారిపోయింది. స్టార్ పవర్, ప్రీమియర్ రివ్యూలు, హైప్—మొత్తం ఫెయిలైంది. మొత్తానికి, ‘కాంతా’ బాక్సాఫీస్ వద్ద క్లియర్ ఫ్లాప్!

Similar Posts