ప్రముఖ నటుడు సోనూసూద్ భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు.. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ముంబై-నాగ్ పూర్ హైవేపే ఈ సంఘటన జరిగింది. సోనాలి డ్రైవ్ చేస్తున్న కారు ట్రక్ ని ఢీ కొట్టిందని, దీంతో కారులో ఉన్న సోనాలి, ఈమె చెల్లి, చెల్లి కూతురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సోనూ సూద్ కుటుంబం విషయానికొస్తే 1996లో సోనాలిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె తెలుగమ్మాయే. వీళ్లకు అయాన్, ఇషాన్ అని ఇద్దరు కొడుకులున్నారు. సోనూసూద్ భార్య సినిమాలకు నిర్మాతగా కొనసాగుతున్నారు.
తెలుగులో విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్ ప్రస్తుతం ఇక్కడ సినిమాలు తగ్గాయి. ఇప్పుడు హిందీపై దృష్టి పెట్టారు. అక్కడ హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ టైమ్ నుంచి తన వంతుగా చాలామందికి సాయం చేస్తున్నాడు.