నాని ప్రధాన పాత్రలో నటించిన HIT 3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి మంచి స్పందనను పొందింది.
HIT 3 సినిమా 11 రోజుల వాల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు బయిటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
HIT 3 సినిమాకు 2వ వారం కూడా మంచి కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్‌తో పాటు మొదటి వారం బాగానే ఉండగా, తరువాతి రోజుల్లో ట్రేడ్ అంచనాలను చేరుకోలేకపోయింది.
HIT 3 – 11 రోజుల వాల్డ్‌వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు:
నైజాం: ₹16.2 కోట్లు (GST సహా)
సీడెడ్: ₹4.4 కోట్లు
ఆంధ్ర: ₹14.15 కోట్లు (GST సహా)
ROI: ₹6.5 కోట్లు
USA: ₹9.5 కోట్లు
మిగతా ROI: ₹2.25 కోట్లు
వాల్డ్‌వైడ్: ₹53 కోట్లు
ఈ 11 రోజుల కలెక్షన్లతో HIT 3 సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. చిత్రం అన్ని బయ్యర్లకు లాభాలు అందించింది. కొన్ని ప్రాంతాల్లో GSTతో కూడా లాభం చూపించింది.
సీడెడ్ ప్రాంతంలో మాత్రం ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ చేరలేదు. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ ₹47 కోట్లు ఉండగా, సినిమా బాక్స్ ఆఫీసులో సూపర్ హిట్‌గా నిలిచింది.
హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.