
థియేటర్లను దూరం చేస్తున్న అసలు నిజం ఏంటంటే… మాధురీ దీక్షిత్ షాకింగ్ అనాలిసిస్!
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్. భాష ఏదైనా, ఇండస్ట్రీ ఏదైనా… సినిమా చూడాలంటే పెద్ద స్క్రీన్ ముందుకే వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు – హిందీ – తమిళం అనే తేడా లేకుండా టికెట్ ధరల పెంపు అన్నది అన్ని పరిశ్రమలను ఒకేసారి ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్యగా మారింది. ఈ మారుతున్న పరిస్థితులపై బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) చాలా క్లియర్‌గా, స్ట్రైట్‌గా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.
“ప్రేక్షకులు రావడం లేదనడం తప్పు… కానీ ఖర్చు భరించలేక వెనకడుగు వేస్తున్నారు”
IANSతో ప్రత్యేకంగా మాట్లాడుతూ మాధురీ దీక్షిత్ కీలకమైన విషయం చెప్పారు. “సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కు వస్తారు. ఇటీవలి కాలంలో భారీ విజయాలు సాధించిన సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాబట్టి జనం ఆసక్తి కోల్పోయారనడం సరికాదు” అన్నారు.
అయితే అసలు సమస్య ఎక్కడంటే… టికెట్ ధరల దగ్గరే.
“ఇప్పుడు ఒక కుటుంబం మొత్తం కలిసి సినిమాకు వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరం అవుతోంది. టికెట్లు, స్నాక్స్, ట్రాన్స్‌పోర్ట్— అందరూ కలిపితే ఒక సినిమానే పెద్ద ఖర్చు. దీంతో ఏ సినిమా థియేటర్‌లో చూడాలి, ఏది ఓటీటీలో చూడాలి అనే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఆమె స్పష్టం చేశారు.
ఓటీటీ సౌకర్యం థియేటర్లకు పెద్ద ఛాలెంజ్ ఎలా అయింది?
ఓటీటీల ప్రభావంపై కూడా మాధురీ చాలా రియలిస్టిక్‌గా మాట్లాడారు. “ఇప్పుడు సినిమాలు మన చేతివేళ్లపైనే ఉన్నాయి. ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 లేదా 9 అవుతుంది. ఆ టైంలో మళ్లీ థియేటర్‌కు వెళ్లడం చాలా మందికి సాధ్యం కాదు. అందుకే వీకెండ్స్ లేదా సెలవు రోజులకు మాత్రమే సినిమాలు పరిమితమవుతున్నాయి.”
ఇంకా ఆమె చెప్పిన మాటలు మరింత ఇంట్రెస్టింగ్
“ఓటీటీలో అయితే మనకు నచ్చిన టైమ్‌లో, ఇంట్లోనే, తక్కువ ఖర్చుతో సినిమా చూడొచ్చు. ఇంట్లో పాప్‌కార్న్ చేసుకుని, ఫ్యామిలీతో కూర్చొని చూడడం చాలా మందికి ఈజీ ఆప్షన్‌గా మారింది.”
అయితే సినిమాల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
ఈ ప్రశ్నకు మాధురీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “సినిమా భవిష్యత్తుకు ఎలాంటి ముప్పూ లేదు. కానీ ఇండస్ట్రీ కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా థియేటర్ అనుభవాన్ని మరింత స్పెషల్‌గా, అందుబాటు ధరలో ప్రేక్షకులకు ఇవ్వగలిగితే… మళ్లీ పాత రోజులు తప్పకుండా తిరిగి వస్తాయి” అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, ఈ పరిణామాల వల్ల సినిమా భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని తాను భావించడం లేదని మాధురి స్పష్టం చేశారు. “సినిమా భవిష్యత్తుకు వచ్చిన ముప్పేమీ లేదు. కాకపోతే కొన్ని విషయాలను సరిదిద్దుకోవాలి. ప్రేక్షకులకు థియేటర్ అనుభవాన్ని మరింత మెరుగ్గా, అందుబాటు ధరలో అందించగలిగితే మునుపటి రోజులు మళ్లీ వస్తాయి” అంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
