సినిమా వార్తలు

ఒక్క టికెట్‌ లక్షా 11 వేలు.. దటీజ్ చిరు క్రేజ్‌

బాక్సాఫీస్ దగ్గర ఎవరెన్ని రికార్డులు క్రియేట్ చేసినా.. ‘బాస్’ దిగనంత వరకే! టాలీవుడ్ సెన్సేషన్ మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డులన్నీ షేక్ అయిపోతున్నాయి. తాజాగా ప్రీమియర్ షో టికెట్ల వేలం చూస్తుంటే మెగా ఫ్యాన్స్ ఎనర్జీ ‘నెక్స్ట్ లెవల్’ లో ఉందని అర్థమవుతోంది.

అమలాపురంలో అరాచకం.. లక్షా 11 వేల టికెట్!

కోనసీమలో మెగాస్టార్ క్రేజ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమలాపురంలోని వెంకటరమణ థియేటర్‌లో ‘ఎంఎస్‌జీ’ మొదటి టికెట్ కోసం వేలం నిర్వహించగా.. వెంకట సుబ్బారావు అనే డైహార్డ్ ఫ్యాన్ ఏకంగా రూ. 1,11,000 వెచ్చించి టికెట్ సొంతం చేసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ” బాస్ ఈజ్ బ్యాక్ విత్ ఏ బాంగ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ ‘OG’ రికార్డ్ అవుట్.. అన్నయ్యే తోపు!

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇదే వెంకట సుబ్బారావు గతంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘OG’ ప్రీమియర్ టికెట్‌ను రూ. 64 వేలకు దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు అన్నయ్య సినిమా కోసం ఏకంగా డబుల్ అమౌంట్ పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. అంటే క్రేజ్ విషయంలో తమ్ముడు ‘ఓజీ’ని అన్నయ్య ‘ఎంఎస్‌జీ’ మించిపోయాడన్నమాట!

నరసాపురంలోనూ అదే ఊపు.. లక్షా రెండు వేలు!

కేవలం అమలాపురమే కాదు.. నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లోనూ మెగా మేనియా నడుస్తోంది. అక్కడ చాగంటి గణేష్ అనే మెగా ఫ్యాన్ రూ. 1,02,000 కి టికెట్ కొని అందరినీ షాక్ కు గురిచేశారు. చౌటుప్పల్‌లో ఓజీ టికెట్ రూ. 1.29 లక్షలు పలికిన రికార్డును ఎంఎస్‌జీ క్రాస్ చేస్తుందా అని ట్రేడ్ వర్గాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి.

సంక్రాంతికి పక్కా పైసా వసూల్!

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి, నయనతార జంటగా వస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో వైబ్స్ మామూలుగా లేవు. 2023లో వచ్చిన ‘భోళా శంకర్’ ఫ్లాప్ తర్వాత బాస్ నుంచి వస్తున్న ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. ఈరోజు సాయంత్రం జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో హైప్ ఇంకా పీక్స్‌కి వెళ్లడం ఖాయం!

Similar Posts