సినిమా వార్తలు

అనీల్ రావిపూడి నెక్ట్ ప్రాజెక్టు కోసం మైండ్ బ్లాకింగ్ ప్లాన్!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇప్పుడు ఒక అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణలను డైరెక్ట్ చేసిన అనీల్.. ఇప్పుడు ‘మన్మథుడు’ నాగార్జునతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 90వ దశకంలోని నలుగురు టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన ఏకైక యంగ్ డైరెక్టర్‌గా అనీల్ చరిత్ర సృష్టిస్తారు.

సంక్రాంతి 2027 టార్గెట్!

ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న అనీల్ రావిపూడి, తన తదుపరి సినిమా కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో, అనీల్ తన దృష్టిని నాగార్జున వైపు మళ్లించినట్లు సమాచారం. ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దించాలని గట్టి ప్లాన్‌తో ఉన్నారట.

బిగ్గెస్ట్ సర్ ప్రైజ్: ఒకే స్క్రీన్‌పై ముగ్గురు స్టార్ హీరోలు?

ఈ వార్తలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు చిరంజీవి, వెంకటేష్ కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అనీల్ రావిపూడికి చిరు, వెంకీలతో ఉన్న మంచి సాన్నిహిత్యం వల్ల, వారిద్దరితో స్పెషల్ గెస్ట్ రోల్స్ చేయించే ఆలోచనలో ఉన్నారట. అదే కనుక నిజమైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయం!

Similar Posts