సినిమా వార్తలు

రాజమౌళి ‘వారణాసి’ సంచలనం!ఒక్క దెబ్బకు సగం బడ్జెట్ రికవరీ!

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూసి ఇండస్ట్రీ వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్.. ఎన్ని కోట్లంటే?

ఈ పాన్-వరల్డ్ అడ్వెంచర్ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా ₹650 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో ఓటీటీ డీల్‌ను దక్కించుకోలేదు.

పుష్ప 2: ₹270 కోట్లు

ధురంధర్: ₹200 కోట్లు+ వీటన్నింటి రికార్డులను తిరగరాస్తూ, రాజమౌళి బ్రాండ్ వాల్యూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.

ఒక్క దెబ్బకు సగం బడ్జెట్ రికవరీ!

‘వారణాసి’ చిత్రాన్ని దాదాపు ₹1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా ఓటీటీ డీల్‌తో సినిమా రిలీజ్ కాకముందే సగం బడ్జెట్ రికవరీ అయినట్లు ఇండస్ట్రీ టాక్. రాజమౌళి తన స్ట్రాటజీలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులకు కొన్ని కీలక సన్నివేశాల ఫుటేజ్ చూపించారని, అది చూసి ఇంప్రెస్ అయిన సంస్థ ఈ భారీ ధరకు అంగీకరించిందని సమాచారం.

హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్.. గ్లోబల్ స్టార్ల సందడి

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్, ప్రియాంక పాల్గొన్న రీసెంట్ ఇంటర్వ్యూలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

రిలీజ్ ఎప్పుడంటే?

అత్యాధునిక 1.43:1 IMAX ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ అద్భుతాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

Similar Posts