సినిమా వార్తలు

‘డీజే టిల్లు’ సెన్సేషన్ నేహా శెట్టి కెరీర్ క్లోజ్? ? అసలేం జరుగుతోంది!

ఒక్క సినిమా.. ఒకే ఒక్క పాత్ర ఒక నటి తలరాతను మార్చేస్తుంది. ‘డీజే టిల్లు’ సినిమాలో ‘రాధిక’గా యూత్ గుండెల్లో సెగలు పుట్టించిన నేహా శెట్టి పరిస్థితి ఇప్పుడు అలాగే కనిపిస్తోంది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌ను వాడుకోవడంలో ఈ అమ్మడు పూర్తిగా ఫెయిల్ అయ్యిందా? వరుస ఫ్లాపులు, ప్లాన్ లేని కెరీర్ మూలంగా 2026 నాటికే ఈ భామకు ఇండస్ట్రీ ఎండ్ కార్డు వేసేసిందా? ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది.

ఐటెం సాంగ్స్, సైడ్ రోల్స్.. ఇదేనా నేహా రేంజ్?

మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడంతో నేహా శెట్టి రూటు మార్చింది. గతేడాది పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాలో ఏకంగా ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. తీరా చూస్తే ఏమైంది? ఎడిటింగ్‌లో ఆ పాటనే లేపేశారు. ఇక తమిళ్‌లో ‘డ్రాగన్’ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు, ‘డ్యూడ్’ సినిమాలో కమెడియన్ సరసన నటించడం చూస్తుంటే.. ఆమె హీరోయిన్ రేసు నుంచి తప్పుకుందనే సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మమిత బైజు లాంటి కొత్త నీరు ఇండస్ట్రీలోకి రావడంతో నేహాకు ప్లేస్ లేకుండా పోయింది.

ఫోటోషూట్లే దిక్కా? రివైవల్ సాధ్యమేనా?

చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో, సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో బిజీగా కనిపిస్తోంది నేహా. కేవలం గ్లామర్ నమ్ముకుంటే ఈ కాంపిటీషన్‌లో నెగ్గుకురావడం కష్టమని ఈ బ్యూటీకి అర్థమైనట్లు లేదు. ఇప్పటి వరకు ఈ ఏడాదికి సంబంధించి ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ కాకపోవడం ఆమె ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోంది. మరి మళ్ళీ ఏదైనా మిరాకిల్ జరిగి నేహా కెరీర్ పుంజుకుంటుందా? లేక ఈ ఏడాదితోనే సైలెంట్ అయిపోతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.

రాధికగా అందరినీ ఊపేసిన నేహా.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడటం టాలీవుడ్‌లో విచిత్రమైన పరిస్థితి. ఐటెం సాంగ్స్ నుంచి మళ్ళీ మెయిన్ లీడ్ లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. మరి నేహా శెట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుందా? లేక సోషల్ మీడియా సెలబ్రిటీగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి!

Similar Posts