
రామ్ చరణ్ రేంజ్ ఏమైంది? మెగా పవర్ కు దెబ్బడిపోయిందా? మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు!
టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య నెంబరింగ్ గేమ్ ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత ఏ హీరో బాక్సాఫీస్ స్టామినా ఎంత అన్నది వసూళ్లే డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోలు వందల కోట్ల క్లబ్‌లో చేరి టాప్ పొజిషన్‌లో దూసుకుపోతుంటే, మరికొందరు స్టార్ హీరోలు మాత్రం ఈ రేసులో వెనకబడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్థానం ఎక్కడ అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభాస్ నెంబర్ వన్.. బన్నీ సెన్సేషన్!
బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా వేట మొదలుపెట్టిన ప్రభాస్, రూ. 1805 కోట్లతో మొదటి స్థానంలో తిరుగులేని మొనగాడిగా నిలిచాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో రూ. 1705 కోట్లు కొల్లగొట్టి రెండో స్థానాన్ని ఆక్రమించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాతి స్థానంలో ‘దేవర’తో ఎన్టీఆర్ రూ. 420 కోట్లు సాధించి నాలుగో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనీసం టాప్ 5లో కూడా లేకపోవడం మెగా ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు.

తేజ సజ్జ స్పీడ్.. చిరంజీవి, పవన్ రేంజ్ ఇదే!
స్టార్ హీరోలంతా వెయిట్ చేస్తున్న తరుణంలో ‘హను-మాన్’ మూవీతో తేజ సజ్జ రూ. 296 కోట్లు రాబట్టి సైలెంట్‌గా ఐదో స్థానాన్ని పట్టేశాడు. ఇక ఆరో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి (మన శంకరప్రసాద్ గారు – 295 కోట్లు), ఏడో స్థానంలో పవన్ కళ్యాణ్ (ఓజీ – 286 కోట్లు), ఎనిమిదో స్థానంలో వెంకటేష్ (సంక్రాంతికి వస్తున్నాం – 260 కోట్లు) నిలిచారు. విచిత్రమేమిటంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ (215 కోట్లు) వసూళ్లతో తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు పదో స్థానంలో ఉన్నారు.
ప్రస్తుతానికి వసూళ్ల లెక్కల్లో రామ్ చరణ్ వెనకబడి ఉన్న మాట వాస్తవమే అయినా, రాబోయే ‘పెద్ది’, ‘వారణాసి’ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బూడిద చేయడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే ఈ ర్యాంకింగ్స్ తలకిందులు అవ్వడం గ్యారెంటీ! మరి రామ్ చరణ్ మళ్ళీ టాప్ ప్లేస్‌లోకి దూసుకొస్తారా? ఈ నెంబరింగ్ గేమ్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? కామెంట్స్ లో రచ్చ చేయండి!
