మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’. ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఇది రెడీ అవుతున్న సంగతి తెలసిందే. ప్రీతి ముకుందన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎంతో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ (Akshay Kumar) నటిస్తోన్నారు. తాజాగా ఆయన లుక్‌ను పరిచయం చేస్తూ చిత్ర టీమ్ కొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. మహాదేవ్‌ పాత్రలో యాక్ట్‌ చేయడంపై అక్షయ్‌ ఆనందం వ్యక్తంచేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమన్నారు.

మొదట ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్‌ వినిపించింది. అయితే కాజల్‌ (Kajal) పార్వతీదేవిగా కనిపిస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక ఇందులో ప్రభాస్‌ నంది పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ…. , శరత్ అంకుల్, ప్రభు అన్న, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ వంటి దిగ్గజాలతో కలిసి వేదికను పంచుకోవడంతో తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఇక, గతంలో వచ్చిన కన్నప్ప చిత్రానికి, తమ కన్నప్ప చిత్రానికి తేడా ఉందని, ఇప్పుడు వస్తోందని తన వెర్షన్ అని మంచు విష్ణు స్పష్టం చేశారు.

“తెలుగులో 50 ఏళ్ల కిందట కృష్ణంరాజు హీరోగా భక్త కన్నప్ప చిత్రం వచ్చింది. ఇప్పుడు కన్నప్పను రీమేక్ చేస్తున్నాం. అయితే ఆనాటి కన్నప్ప, నేను తీస్తున్న కన్నప్ప సేమ్ స్టోరీ కాదు. కన్నప్ప కథను నా పంథాలో చెబుతున్నాను. ఇప్పటి తరానికి కన్నప్ప గురించి తెలియాల్సిన అవసరం ఉంది” అని మంచు విష్ణు వివరించారు.

‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. అక్కడే ఈ సినిమా షూట్‌ చేయడానికి గల కారణాన్ని చిత్ర టీమ్ తెలియజేసింది. ‘‘ఈ చిత్ర కథ మూడో శతాబ్ద కాలం నాటిది. ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్‌లో చిత్రీకరణ చేపట్టాం’’ అని చెప్పింది.

మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి హేమాహేమీలు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

, , ,
You may also like
Latest Posts from