కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మభూష‌ణ్ ద‌క్కింది. ఇది బాల‌య్య అభిమానుల‌కే కాదు. తెలుగు చిత్ర‌సీమ‌కు, తెలుగు సినీ అభిమానుల‌కు, తెలుగువాళ్ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards) ప్రకటించింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలకృష్ణ, అజిత్‌ కుమార్‌, శోభన తదితరులను పద్మ భూషణ్‌ అవార్డులకు ఎంపిక చేసింది. దీంతో వీరికి సోషల్‌ మీడియా లో అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

‘‘ఐదు దశాబ్దాలకుపైగా తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ (Balakrishna) పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందూపురం శాసన సభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎన్నో సేవలందించారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ – పవన్‌ కల్యాణ్‌.

‘‘పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. ఈ అవార్డును అందుకోవడానికి మీరు పూర్తి అర్హులు’’ – మహేశ్‌బాబు

‘‘కళారంగానికి విశేషమైన సేవలందించినందుకుగాను దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ అందుకున్నందుకు బాలకృష్ణకు అభినందనలు. నటుడిగా, ఎమ్మెల్యేగా, క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌గా మీరు చేసిన సేవలకు ఈ గౌరవానికి అర్హులు. ఈ ఘనత సాధించినందుకు అజిత్‌కుమార్‌కు (Ajith Kumar) అభినందనలు. అలాగే శోభనకు ఈ అవార్డు రావడం చాలా గర్వంగా సంతోషంగా ఉంది’’ – సాయి దుర్గాతేజ్‌

, , , , , ,
You may also like
Latest Posts from