రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్ . చాలా ఏళ్ళ తర్వాత ఈ స్దాయి సక్సెస్ సాధించారు. మూడు వందల కోట్లు నెల లోపలే దాటిందంటే మాటలు కాదు. థియేటర్లకు రావడం మానేసిన ఎందరో ప్రేక్షకులు కేవలం టాక్ విని బయటికి కదిలారని ట్రేడ్ చెప్తోది. ఇలా వెంకీ కెరీర్ మళ్లీ పీక్స్ కు చేరిన వేళ ఆయన చేసిన రానా నాయుడు 2 వెబ్ సీరిస్ టీజర్ వదిలారు.
ఈ క్రేజ్ ఖచ్చితంగా రానా నాయుడు 2కి చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ కనిపించబోయే ఫ్రెష్ రిలీజ్ ఇదే .
అందులోనూ డబుల్ మీనింగులు తగ్గించామని మాట ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీలు కూడా చూడవచ్చు అంటున్నారు.
https://www.youtube.com/watch?v=c6r_cWnEre0
రానా సీక్వెల్ లోనూ కొనసాగుతూ ఉండగా అర్జున్ రామ్ పాల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రచ్చ చేస్తున్నారు. స్ట్రీమింగ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. సమ్మర్ స్పెషల్ కావచ్చు.
వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది.