అర్జున్ రెడ్డి ఎప్పుడైతే వచ్చి విజయ్ దేవరకొండ కు సక్సెస్ ఇచ్చిందో అప్పుడు అందరూ అతని వంక ఒక్కసారి చూసారు. కొత్త సంచలనం వచ్చింది అని టాలీవుడ్ అంతా అనుకున్నారు. ఆ సినిమా తర్వాత గీత గోవిందం రూపంలో మరో సంచలన విజయం సాధించాడు. అయితే, అక్కడ నుంచే విజయ్ దారి తప్పాడు. క్రేజీ కాంబినేషన్స్ కు వెళ్లి డిజాస్టర్స్ ఇవ్వటం మొదలెట్టారు. అది లైగర్ తో పీక్స్ కు వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్, ఖుషీ కూడా ఆడలేదు. దాంతో పూర్తిగా ట్రాక్ ఆఫ్ అయ్యాడు. అతను ఎంపిక చేసుకునే కథలు దారుణంగా ఉంటున్నాయని అందరికీ అర్దమైంది. అయితే ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది.

విజయ్ తన లేటెస్ట్ చిత్రం VD 12 లో ఏదో కొత్తదనం ఉందని ప్రమోషన్ మెటీరియల్ ని బట్టి అర్దమవుతోంది. దాంతో మళ్లీ రైట్ ట్రాక్ లో పడ్డారని అభిమానులు సంబరపడుతున్నారు. యూనిట్‌కి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటి వరకు తెరపై రాని కొన్ని కొత్త అంశాలతో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రెడీ చేసారని అర్దమవుతోంది. రొటీన్ సినిమాల తర్వాత, విజయ్ ఇప్పుడు తిరిగి హిట్ కొట్టడానికి రెడీ అయ్యారనిపిస్తోంది.

విజయ్ దేవరకొండ 12వ చిత్రం అయిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. విజయ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా టీజర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్రవరి 12న విజయ్ దేవరకొండ టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నారు.

ఈ టీజర్ ను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ టీజర్ ను స్టార్ హీరోల వాయిస్ తో రిలీజ్ చేయనున్నారు. తెలుగులో విజయ్ సినిమా టీజర్ కు తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వనున్నారు. రీసెంట్ గా ఈ విషయాన్నీ మేకర్స్ అనౌన్స్ చేశారు.

అలాగే తమిళ్ లో సూర్య వాయిస్ ఇవ్వనున్నారు. అలాగే హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇవ్వనున్నారు.

, , ,
You may also like
Latest Posts from