పైన చిరు నవ్వులు నవ్వుతూ క్యూట్ గా ఉన్న ఈ పాపను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదూ. అవును ఆమెను మీరు బాగానే చూసి ఉంటారు. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుపమ. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫోటోలు మీ ముందు పెట్టాం.

పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది.

‘ప్రేమమ్’ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమాతో హీరోయిన్ గా డైరక్ట్ గా తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారింది. టిల్లు స్క్వేర్ సినిమాతో అందాల గేట్లు తెరిచేసిన అనుపమ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆ తర్వాత ఎందుకో ఈ బ్యూటీ స్లో అయింది

అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ అయ్యింది.

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ప్రస్తుతం తెలుగులో ‘ప‌ర‌దా’లో న‌టిస్తోంది. ఇది లేడీ ఓరియేంటెడ్ చిత్రం. ఈ సినిమా స‌క్సెస్ అయితే గ‌నుక అనుప‌మ కెరీర్ మ‌రో కొత్త ట‌ర్నింగ్ తీసుకుంటుంది. సోలో నాయిక‌గా మ‌రిన్ని అవ‌కాశాలు అందు కోవ‌డానికి ఛాన్స్ ఉంది.

You may also like
Latest Posts from