ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి వరస హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారు. దీంతో ఈ చిత్ర రీమేక్‌ను ఆయన డైరెక్ట్ చేయరని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు మరో డైరెక్టర్‌తో ఈ మూవీని రీమేక్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఈ రీమేక్ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కసారి డైరెక్టర్ కన్ఫర్మ్ అవగానే, ఈ సినిమాను దిల్ రాజు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.