కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభమై ఎంత కాలం అయినా పూర్తి కావు. రకరకాల కారణాలుతో వాయిదాలు పడుతూ, మెల్లిగా షూటింగ్ జరుపుకుంటూ నత్త నడక నడుస్తూంటాయి. అలాంటిదే కల్కి 2898 ఏడీ చిత్రం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికి ప్రారంభమై 850 రోజులు అయ్యింది. అయినా ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రానికి ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. దాంతో రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు నిర్మాతలు. ఊహించని విధంగా లేటు అవుతూ వస్తోంది. సాధారణంగా మారుతి డైరక్ట్ చేసే సినిమాలు చాలా స్పీడుగా ఫినిష్ అవుతాయి. కానీ ఈ సినిమా చిన్న సినిమా మొదలై ప్యాన్ ఇండియా గా మారటంలోనే సమస్యలు మొదలయ్యాయి. దాంతో రీషూట్ లు, విఎఫెఎక్స్ మార్పులు, ఇంకా ప్రభాస్ వేరే సినిమాల్లో బిజి అవ్వటం కారణాలుగా లేటు అవుతూ వస్తోంది.

వాస్తవానికి ‘రాజా సాబ్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తేదీన సినిమా విడుదల కావడంలేదని ఈ ప్రాజెక్టుతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.

‘ది రాజా సాబ్’ చిత్రం విడుదల తేదీ వాయిదా పడిందని, ఆ రోజున సినిమా రావడంలేదని తెలిపారు. కొత్త తేదీ ఖరారు చేశార ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని పేర్కొన్నారు.

‘రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళ నటి మాళవికా మోహనన్ కు ఇది తెలుగులో ఇదే తొలి చిత్రం కానుంది. ‘రాజా సాబ్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

, , ,
You may also like
Latest Posts from