విక్కీ కౌశల్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ఛావా’ (Chhaava). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బ్యానర్‌పై మార్చి 7న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా మూవీ టీం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ తెలుగులోనూ అదే హైప్ క్రియేట్ చేస్తోంది.

మూవీలో శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక అద్భుతంగా నటించారు. ‘మరాఠాల సింహం లేనప్పటికీ తన వేటను ఈ ఛావాను కొనసాగిస్తాడు’, ‘గర్జనకు లొంగకపోతే పంజా వేటు తప్పదు’ అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

మార్చి 7వ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఆ రోజు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

తెలుగు వర్షన్‌లో ఛావా రిలీజైతే ఇక్కడ మరింత కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప సినిమాను టాలీవుడ్‌ ఆడియన్స్‌కు అందించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ఛావా తెలుగు డబ్బింగ్‌ పనులను ప్రారంభించినట్లు సమాచారం.

, , , ,
You may also like
Latest Posts from