మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తాజా చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara)రిలీజ్ డేట్ దాదాపు ఫిక్సైనట్లే క నపడుతోంది. వాస్తవానికి జనవరి 10 నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం సినిమాని వాయిదా వేశారు. ఆ తర్వాత మే 9న ‘విశ్వంభర’ థియేటర్స్ కి రావడం ఖాయమన్నట్టు ప్రచారం జరిగింది.

చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ అయిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) రిలీజ్ డేట్ కాబట్టి.. ‘విశ్వంభర’ కి ఆ హైప్ కలిసి వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ వీఎఫ్ఎక్స్ పనులు బ్యాలెన్స్ ఉండటం వల్ల.. ఇప్పుడు ఆ డేట్ కూడా డౌట్ గానే ఉంది. అయితే ఇప్పుడు కొత్త డేట్ ముందుకు వచ్చింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 22 అయితే చిరంజీవి పుట్టిన రోజు కాబ‌ట్టి, క్రేజ్ ఉంటుంద‌ని, ఫ్యాన్స్ కి కూడా ఓ గిఫ్ట్ ఇచ్చిన‌ట్టు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు పాట‌లు మిన‌హా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ గ్యాప్ లో వీఎఫ్ఎక్స్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకు అవకాసం దక్కుతుంది.

, , ,
You may also like
Latest Posts from