పవన్ కల్యాణ్ కు భక్తుడు టైప్ అభిమాని బండ్ల గణేష్. ఆయనతో సినిమాల్లో నటించారు. సినిమాలు నిర్మించారు. అలాగే ప్రతి విషయంలోనూ పవన్ కు సపోర్ట్ చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ నేడు భారీ ఎత్తున తన పార్టీ ఆవిర్భావ సభని తన నియోజకవర్గంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ స్పీచ్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ మీటింగ్ కి ముందు బండ్ల గణేష్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది.

“ఒక్క వీరుడు తను సాధించిన విజయంతో ఊరుకోడు… ఆ విజయాన్ని పంచి, మరికొందరికి మార్గం చూపుతాడు! “విజయం ఒక గమ్యం కాదు, ఓ వీరుడి ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే!” అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి మరీ తన బాస్ అంటూ తన మార్క్ ఎలివేషన్ ని సోషల్ మీడియాలో అందించారు.

దీనితో ఈ పోస్ట్ ఇపుడు అభిమానుల్లో వైరల్ గా మారింది.

నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఆంజనేయులు. ఈ సినిమా తర్వాత తీన్ మార్ , గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేశాడు. ఇక బండ్లగణేష్ రాజకీయాలను కూడా టచ్ చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్లగణేష్ తన ట్వీట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు.

,
You may also like
Latest Posts from