టీజర్, ట్రైలర్ తో క్రేజ్ క్రియేట్ చేస్తే ఓపినింగ్స్ రావటమే కాదు , బిజినెస్ కూడా ఈజీగా అయ్యిపోతుంది. మరీ ముఖ్యంగా ఓటిటి బిజినెస్ కు లోటు ఉండదు. ఆ విషయం తమన్నా ప్రధాన పాత్రలో అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓదెల 2’ ప్రూవ్ చేసింది. ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ సినిమాని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్, మధు క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌.సింహ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా త‌మ‌న్నా సినిమా ఓటీటీ డీల్ కుదుర్చుకొంది.

తమన్నా అందులో శివశక్తిగా ఆసక్తిరేకెత్తించేలా కనిపించింది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతమందిస్తుండగా.. సౌందర్‌ రాజన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓటీటీ డీల్ రీసెంట్ గా క్లోజ్ అయ్యింది.

అమేజాన్ సంస్థ రూ.12 కోట్ల‌కు ఓటీటీ హ‌క్కుల్ని కొనుగోలు చేసింది. హిందీ డ‌బ్బింగ్ రూ.6.25 కోట్ల‌కు అమ్మేశారు.

శాటిలైట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిన‌ట్టే అని తెలుస్తోంది. దాంతో ఈ సినిమాకు మొత్తం రూ.20 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. అదంతా.. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో వ‌చ్చేసిన‌ట్టే. ఇక థియేట‌ర్ నుంచి వ‌చ్చిందంతా… లాభ‌మే అని చెప్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from