బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ (Kareena Kapoor) గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.వరస పెట్టి సినిమాలు చేయటమే కాకుండా ప్రతి సినిమాతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎన్నో క్రైమ్ డ్రామా మూవీలలో నటించిన ఈమె అంతకుమించి తన నటనతో మెప్పించింది. అలాగే నిజ జీవిత వార్తలతోనూ ఆమె వార్తల్లో ఉంటుంది. భర్త సైఫ్ అలీ ఖాన్ తో ఆనందకరమైన జీవితం గడుపుతున్న ఆమె వివాహానికి ముందు ఓ ప్రముఖ పొలిటీషన్ ని డేటింగ్ చేయాలనుకుంది.
2000లో కరీనా కపూర్ సిమీ అగర్వాల్ టాక్ షోకు హాజరయ్యినప్పుడు ఈ విషయం రివీల్ చేసింది. కరీనా కపూర్ ని మీరు అవకాసం దొరికితే ఏ రాజకీయనాయకుడుతో డేటింగ్ చేయటానికి ఎంచుకుంటారు అని అడిగారు. దానికి కరనా తడుముకోకుండా వెంటనే రాహుల్ గాంధీ పేరు చెప్పింది. అతని ఫొటోలు రెగ్యులర్ గా చూస్తూంటానని చెప్పుకొచ్చింది.
ఇక కరీనా కపూర్ మొదటిసారి ‘రెఫ్యూజీ’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత అశోక, కభీ ఖుషీ కభీ గమ్ అనే సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. వీటితో పాటు చమేలీ, ఓంకార, దేవ్, జబ్ వియ్ మెట్, బాడీగార్డ్, రా.వన్, ఇడియట్స్, భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
అలా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు అందుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తోటి నటుడు సైఫ్అలీఖాన్ (Saif AliKhan) ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఈ జంటకు తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. ప్రస్తుతం కుటుంబంతో హ్యాపీగా ఉన్న ఈమె అటు సినిమాలలో కూడా అడపాదడపా నటిస్తోంది.