సినిమా పరిశ్రమలో లవ్ లు, బ్రేకప్ లు కామన్. అయితే పెళ్లాం,బిడ్డలు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందులోనూ బాగా పాపులారిటీ ఉన్న వాళ్లు తమ పేరు ఎక్కడ చెడిపోతుందో అని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి మీడియాలో ఊహించనని విధంగా వాళ్ల పేర్లు బయిటకు వచ్చేసి రచ్చ అయ్యిపోతూంటుంది. అలాంటిదే ఇప్పుడు స్టార్ డైరక్టర్ రోహిత్ శెట్టి విషయంలో జరుగుతోంది.

రోహిత్‌ శెట్టి సినిమాలు చాలా మోడర్న్‌ గా ఉంటాయి. ఓ రకంగా బాలీవుడ్‌లో కమర్షియల్లీ ఎంటర్‌టైనింగ్‌ సినిమా ఫార్ములాను ప్రవేశపెట్టిన దర్శకుడు! హీరో వర్షిప్‌ను డైరెక్టర్‌ వర్షిప్‌గా మార్చేసిన వాడు.. టెక్నీషియన్స్‌ ఇమేజ్‌ను పెంచేసినవాడు! అయితే ఈ ఫిల్మ్‌ మేకర్‌ ఇప్పుడో టీవి నటితో పూర్తిగా ప్రేమలో పడి వార్తల్లో నిలుస్తున్నాడు.

రోహిత్ శెట్టి ప్రేమించిన నటి పేరు ప్రాచీ దేశాయ్‌. ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై’లో వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్. ‘బోల్‌ బచ్చన్‌’ చిత్రీకరణ జైపూర్‌లో జరుగుతున్నప్పుడు వీరి ప్రేమ చిగురించిందిట. దాంతో ఆమెను ప్రత్యేకంగా ట్రీట్‌ చేయసాగాడు. షూటింగ్‌ ప్యాకప్‌ అవగానే డిన్నర్‌ డేట్స్, రొమాంటిక్‌ ఈవెనింగ్స్‌ను ఆస్వాదించసాగాడు ప్రాచీతో. రోహిత్‌కు పెళ్లయిన విషయం తెలిసున్న ఆమె మొదట అతనితో ముభావంగానే ఉంది. కానీ మెల్లి మెల్లిగా అతనితో డేటింగ్ కు వెళ్లోంది. అది సహజీవనం దాకా వెళ్లిందని బాలీవుడ్ అంటోంది.

మరో ప్రక్క రోహిత్‌ శెట్టి ది పెద్దలు కుదిర్చిన వివాహం. భార్య పేరు మాయా. ఒక కొడుకు కూడా. ఇషాన్‌ శెట్టి ఉన్నారు. ఇప్పుడు ఆమె ప్రేమలో పడి సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటున్నారు. చూడాలి ఎంతవరకూ ఈ యవ్వారం వెళ్తుందో.

,
You may also like
Latest Posts from