ప్రముఖ దర్శకుడుగా ఓ వెలుగు వెలిగిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యన తన సినిమాలపై దృష్టి సరిగ్గా పెట్టడం లేదు. దాంతో సినిమాలు వచ్చినంత వేగంగా వెళ్లిపోతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి, ఆలోచనలతో తనకు సంభందం లేదంటూ ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని చెప్పే ఆయన తాజా చిత్రం ‘శారీ’. ఈ సినిమా అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అందా చూద్దాం.

స్టోరీలైన్

నిరంతరం రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ కాలక్షేపం చేస్తూండే ఈ జనరేషన్ యువతి ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి). ఆమె కి చీరలు అంటే విరపీతమైన ఇష్టం. దాంతో ఎప్పుడూ చీరలోనే ఉండే ఆమె చీరలోనే రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. అయితే ఇలా చేయటం ఆరాధ్య అన్నయ్య రాజ్ (సాహిల్ సంభవాల్) కి ఇష్టం ఉండదు. ఆమెను తరచూ హెచ్చరిస్తూ ఉంటాడు.

ఇక ఓ సారి ఆమె స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు ఆరాధ్య నీ చూస్తాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఇష్టపడి ఇమ్మీడియట్ గా ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. అక్కడితో ఆగకుండా ఇన్‌స్టాగ్రామ్‌ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి రప్పించి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె అతన్ని ఓ స్నేహితుడులాగానే ట్రీట్ చేస్తుంది. మరో ప్రక్క ఇవన్నీ ఇష్టపడని ఆమె అన్నయ్య రాజ్ అంటే గిట్టదు కిట్టుకి. దాంతో ఫోటో షూట్ టైమ్ లోనే గొడవ పడుతాడు.

ఇవన్నీ చూసిన ఆరాధ్య… కిట్టుని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూంటాడు. కానీ కిట్టు మాత్రం ఈ క్రమంలో సైకోలా మారిపోయి వేధించటం మొలెడతాడు. ఈ క్రమంలో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. అయినా సరే తగ్గేదేలే అన్నట్లు కిట్టు ఆమెను వేధించటం మానడు. ఆమెను కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు ఏమైంది. కిట్టు నుంచి ఆరాధ్య తనను తాను ఎలా రక్షించుకుంది అనేదే మిగతా కథ.

ఎనాలసిస్

స్టోరీ లైన్ గా వినటానికి బాగానే ఉన్నా..సినిమాకు సరపడే ఇంటెన్స్ ఉన్న కంటెంట్ లేదు. ఇలా సైకోలా వెంటబడే సీన్స్ వర్మ గత చిత్రాల్లో చూసినవే. అలాగే సోషల్ మీడియా వేధింపులు రోజూ మీడియాలో వస్తున్నవే. వాటిని సరిగ్గా కనెక్ట్ చేసి కథనాన్ని కొత్తగ నడిపి ఉంటే ఇంట్రస్ట్ గా ఉండేది. అలా కాకుండా పరమ రొటీన్ గా, చాలా ప్రెడిక్టబుల్ గా, సింగిల్ లైన్ చుట్టూ అల్లిన కథతో సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. దాంతో కథలో విషయం లేక బలవంతంగా వేసిన సీన్స్ ,రిపీట్ అయ్యి బోర్ కొట్టించి, సాగ తీతకు గురి చేసాయి.

ఇవన్నీ చాలదన్నట్లు కిట్టూ పాత్ర సైకోయిజం, మితి మీరిన హింస, రక్త ప్రవాహం ఇబ్బంది పెట్టాయి. సినిమాలో సాగతీత విసిగిస్తుంది. రామ్ గోపాల్ వర్మ మ్యాజిక్ కనపడదు. ప్రతి పావుగంటకూ ఊహల్లో ఓ సాంగ్ వేసుకున్నారు. అవన్నీ ఎరోటిక్ సాంగ్స్. వాటిల్లో రామ్ గోపాల్ వర్మ ఊహాసుందరిని చూసుకున్నట్లు ఉన్నారు. అలా ఆరాధ్య దేవిని రకరకాలుగా ఊహించుకుంటూ చూపించారు. అంతేగాని ప్రేక్షకులకు ఇవన్నీ ఇచ్చుతాయా లేవా అన్నది పట్టించుకోలేదు.

టెక్నికల్ గా..

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే టెక్నికల్ గా హై స్టాండర్డ్ తో ఉండేది. అయితే ఈ సినిమాలో అవేమీ కనపడవు. అన్నీ ఏదో మ్రొక్కుబడికి ఉన్నట్లు జస్ట్ ఓకే అన్నట్లు ఉంటాయి. ఉన్నంతలో ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ మనస్సు పెట్టి చేసారనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త సౌండ్ తగ్గిస్తే బాగుండేది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ చుట్టేసినట్లు తెలిసిపోతుంది.

నటీనటుల్లో …

ఏదైమైనా హీరోయిన్ గా ఆరాధ్య వర్కవుట్ కాలేదు. ఆమెలో నటి అయితే కనపడదు. ఏదో పాటల్లో చూడ్డానికి బాగుందని సెలక్ట్ చేసి తీసారు. సత్య యాదు బాగా చేసాడు. హీరోయిన్ అన్నగా సాహిల్ శంభావల్, హీరోయిన్ తల్లిదండ్రులుగా కల్పలత, అప్పాజీ అంజరీష్ బాగానే చేసారు.

చూడచ్చా

ఇంత చదివాక కూడా చూడాలి అనే కోరిక ఉంటే ఖచ్చితంగా మీరు రామ్ గోపాల్ వర్మకు వీరాభిమాని అయ్యింటారు. వెళ్లి చూడటమే.

, ,
You may also like
Latest Posts from