వయస్సుతో పాటు అందం పెరిగే భామల్లో శ్రియా శరణ్ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు అయినా శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్‌తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది.

శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్‌గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్‌గా స్లిమ్‌గా ఉంటుంది.

నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్‌ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్‌, బ్యూటీ సీక్రెట్‌లేంటో చూద్దామా..

తాజాగా, తన ఫిట్‌నెస్, శక్తికి మూలమైన ఐదు రకాల సహజసిద్ధమైన ప్రోటీన్ ఆహారాల గురించి శ్రియ పంచుకున్న వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి సమతుల్య ఆహారం ఎంతో ముఖ్యమని శ్రియ వెల్లడించారు.

అందుకే తాను రోజువారీ డైట్‌లో పోషకాల సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ముఖ్యంగా, శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో, కండరాల పటుత్వాన్ని కాపాడటంలో ప్రోటీన్ల పాత్ర కీలకమని శ్రియ చెబుతున్నారు. కృత్రిమ సప్లిమెంట్ల కన్నా సహజ వనరుల ద్వారా ప్రోటీన్లను పొందడానికే తాను మొగ్గు చూపుతానని వివరించారు.

శ్రియ తన డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకునే ఐదు రకాల సహజ ప్రోటీన్ ఆహారాలు ఇవే!

1) గుడ్లు: సంపూర్ణ ప్రోటీన్‌కు ఇవి అద్భుతమైన మూలం. శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా గుడ్ల ద్వారా లభిస్తాయి.

2) పప్పు ధాన్యాలు: కందిపప్పు, పెసరపప్పు, శనగలు వంటివి మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి ఉదాహరణలు. ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

3) పాల ఉత్పత్తులు: పనీర్, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కాల్షియంతో పాటు మంచి నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి శాఖాహారులకు ముఖ్యమైన ప్రోటీన్ వనరు.

4) గింజలు & విత్తనాలు: బాదం, వాల్‌నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటివి ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.

5) చేపలు / చికెన్: మాంసాహారం తీసుకునే వారికి, లీన్ ప్రోటీన్‌కు చికెన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో కూడిన ప్రోటీన్‌కు చేపలు అద్భుతమైన ఎంపికలు.

ఈ ఐదు రకాల ఆహారాలను తన డైట్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను సహజ పద్ధతిలో పొందుతున్నానని, ఇది తన ఫిట్‌నెస్, నిత్య యవ్వనంగా కనిపించే గ్లో వెనుక ఉన్న రహస్యాలలో ఒకటని స్పష్టం చేశారు.

You may also like
Latest Posts from