ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న – ఈ త్రయం కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించడమే ఓ హైప్. అదేంటంటే… దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ హైప్‌ని మార్కెట్ హంగామాగా మార్చేశాడు!
“కుబేర” సినిమా విడుదల కాకముందే… బిజినెస్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.
OTT హక్కులు – భారీ మొత్తం కోసం సైన్
హిందీ డబ్బింగ్ – టాప్ ప్లేయర్లు పోటీ
ఆడియో రైట్స్ – సురక్షితంగా అమ్ముడుపోయిన సమాచారం
ప్రస్తుతానికి 30% పెట్టుబడి రికవరీ పూర్తయిందని బిజినెస్ వర్గాల టాక్
ఇంకా థియేట్రికల్ రైట్స్ (తెలుగు, తమిళ) ఫైనల్ కాలేదు. అయినా వాటికోసం విపరీతమైన డిమాండ్ ఉంది.
అయితే ఈ మూవీ బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువే అయినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. క్యాస్టింగ్ పారితోషికాలు, షూటింగ్ వ్యయాలు.. అలా వివిధ విషయాల్లో లెక్కలు చేంజ్ అయ్యాయని సమాచారం. మొత్తం కలిపి రూ.100 కోట్లు అయ్యి ఉండొచ్చని వినికిడి.
మూవీ విషయానికొస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆమె లుక్స్ ను మేకర్స్ రివీల్ చేశారు. జిమ్ సెర్బ్, దలీప్ తహిల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.