ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధేశ్యామ్ మూవీ ద్వారా ఆ మధ్యన ఆడియన్స్ ముందుకి వచ్చారు యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అయితే ఆ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. డిజాస్టర్ అయ్యింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ టాక్ ప్రకారం రాధాకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
రీసెట్ గా వరుణ్ తేజ్‌కు ఓ కథ చెప్పి ఒప్పించాడట రాధాకృష్ణ. ఇది ఒక క్లాసికల్ లవ్ స్టోరీ అని సమాచారం. ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బ్యానర్ వివరాలు, షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అనే సమాచారం త్వరలో బయటకు రానుంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ఐటెం సాంగ్‌ను ‘ఆచార్య’ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే రాధాకృష్ణ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇటీవల వరుణ్ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మాత్రం తాను ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయాలనే ఆసక్తితో ఉన్నాడు. ఆ నేపధ్యంలోనే రాధాకృష్ణ చెప్పిన కథ అతనికి నచ్చిందని వినిపిస్తోంది. ‘రాధేశ్యామ్’ పరాజయం అయినా, ఆ సినిమాలోని రొమాంటిక్ మూమెంట్స్‌ను మెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు.