ఒకప్పుడు డైరెక్టర్లూ, రైటర్లూ తెరపైకి వచ్చి హీరోలుగా వెలిగిన కాలం అది! భారతీయ సినీ చరిత్రలో భాగ్యరాజా, కాశీనాథ్, ఉపేంద్ర, తెలుగులో దాసరి వంటి దర్శకులు తమే కథ రాసి, తమే డైరెక్ట్ చేసి, చివరికి స్క్రీన్ మీదే నటించి విజయాల్ని కొల్లగొట్టారు. కథలో నిజాయితీ ఉండటం, నటన కంటే కథనమే ఓడిస్తే చాలు అనే ఆత్మవిశ్వాసంతోనే వారు హీరోలుగా మారారు.

ఇప్పుడది మళ్లీ జరుగుతున్నట్టే కనిపిస్తోంది! తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోకేశ్ కనగరాజ్…త్వరలో హీరో గా అవతారం ఎత్తబోతున్నాడంటున్నారు.

‘ఖైది’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి హిట్లు ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడట! విశేషం ఏమిటంటే… ఈ సినిమాను తనే డైరెక్ట్ చేసుకుంటాడట.

ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదుగానీ… కోలీవుడ్ వర్గాల్లో మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం లోకేష్ ..రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రం డైరక్ట్ చేస్తున్నాడు.

You may also like
Latest Posts from